డిజిటలైజేషన్ కు 500 దెబ్బ

500 note effect on Digitalisation

దేశ ప్రజలకు డిమానిటైజేషన్ దెబ్బ బాగా గట్టిగా తగిలింది. మోదీ సర్కార్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం వల్ల సగటు మనిషి ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణంగా మారింది. అయితే అవినీతి అంతానికి డిజిటల్ పేమెంట్లు ఒక్కటే మార్గం అని మోదీ భావించినట్లున్నారు. అందుకే డిజిటల్ వైపుకు అడుగులు వేస్తూ.. క్యాష్ లెస్ సర్వీసుల వైపు జనాలు మళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని వినహాయింపులు కూడా చేస్తోంది. డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి కొన్ని రాయితీలు కూడా ఇస్తోంది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశంలో కరెన్సీ కొరత తీవ్రంగా ఉంది. ఏ బ్యాంకు ముందైనా, ఏ ఏటీఎం ముందైనా క్యులోని జనాలు మాత్రం తగ్గడం లేదు. అయితే అసలు నగదు కరెన్సీ లేనందు వల్ల చాలా వరకు ఆన్ లైన్ ట్రాన్సాషన్స్ పెరుగుతున్నాయి. కాగా నగదును పెంచుతున్నట్లు కేంద్రం తాజాగా చేసిన ప్రకటన క్యాష్ లెస్ కు మరో అడ్డుగోడగా నిలుస్తుంది అనడంలో అనుమానం లేదు. ఎందుకంటే ఫిబ్రవరి వరకు భారీగా 500 నోట్లను తీసుకురాబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే తిరిగి నగదు చేతుల్లోకి వస్తే.. అసలే నగదు కొరతను, బ్యాంకుల ముందు పడిగాపులను గమనించిన జనాలు తిరిగి ఆ డబ్బులను బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యరు. అలాగే చేతిలో డబ్బులు ఉంటే ఎందుకు డిజిటల్ వైపు ఆలోచిస్తారు.. కాబట్టి తిరిగి పాత పద్ధతిలో నగదుతో పేమెంట్లు చేస్తారు. మరి ఇలా మోదీ తీసుకున్న క్యాష్ లెస్ కు 500 నోట్ల దెబ్బ ఖచ్చితంగా ఉంటుంది. ఒక అడుగు ముందుకేస్తున్న కేంద్రం ఐదు అడుగులు వెనకేస్తోంది అనడంలో ఎలాంటి  అనుమానం లేదు.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
ఏపీ బంద్.. హోదా కోసం
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
పిహెచ్‌డి పై అబద్ధాలు
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
వంద, యాభై నోట్లు ఉంటాయా?
యుపీలో ఘోర రైలు ప్రమాదం
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
నరేంద్రమోదీ@50 రోజులు
శశికళ దోషి.. పదేళ్లు ఎన్నికలకు దూరం

Comments

comments