60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?

60 Percent income tax on incountable money

దేశంలో నల్లధనం మీద మోదీ తీసుకుంటున్న చర్యలపై తీవ్ర చర్చసాగుతోంది. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నోసార్లు తమ నల్లధనానికి పన్ను చెల్లించి, మామూలుగా చేసుకోవాలని కోరారు. కానీ చాలా మంది నల్లకుబేరులు మోదీ మాటలను పట్టించుకోలేదు. దాంతో మోదీ కొరడా ఝులిపించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ట్యాక్స్ కట్టని చాలా మంది డైలమాలోపడ్డారు. అలా లెక్కలు చూపని సంపాదనను నియంత్రించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. అలా వెల్లడయిన సొమ్ముపై 60 శాతం ఆదాయం పన్ను విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ప్రభుత్వం ఐదు వందలు, వెయ్యి నోట్లను రద్దుచేసిన రెండువారాల వ్యవధిలోనే జీరో బ్యాలెన్స్ జన్‌ధన్ అకౌంట్లలో రూ.21 వేల కోట్ల మేర డిపాజిట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్యాక్స్ ప్రతిపాదన ముందుకొస్తున్నది. ఇంతకాలంగా ఏమీలేకుండా ఒక్కసారిగా అంత భారీ మొత్తం జమకావడం వెనుక మనీలాండరింగ్ మతలబే ఉండొచ్చని అధికారవర్గాలు అనుమానిస్తున్నాయి. అనుమానం కలిగిన డిపాజిట్లను అక్రమ సంపాదనగానే భావించి 30 శాతం పన్నుతోపాటు 200 శాతం జరిమానా విధించనున్నట్లు, ప్రాసిక్యూషన్ జరుపనున్నట్లు అధికారులు హెచ్చరించారు. సెప్టెంబర్ 30 లోగా అప్పటివరకు లెక్కలు చూపని అక్రమ ధనాన్ని వెల్లడించేందుకు ప్రభుత్వం ఇంతకుముందు అవకాశం కల్పించింది. అలాంటి సొమ్ముపై 45 శాతానికిపైగా పన్ను, జరిమానా విధించేలా ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ప్రభుత్వం ఆదాయం పన్ను చట్టానికి సవరణ తేవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోనివారిపై ఇప్పుడు 60 శాతం దాకా పన్ను విధించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ బినామీ డిపాజిట్లను, ప్రత్యేకించి జన్‌ధన్ అకౌంట్లలో అక్రమ డిపాజిట్లను పూర్తిగా నివారించాలని ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts:
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
కృష్ణా పుష్కర భక్తులకు హెచ్చరిక: కృష్ణా జలాల్లో బ్యాక్టీరియా
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
స్థూపం కావాలి
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
వాళ్లను వదిలేదిలేదు
జియోకే షాకిచ్చే ఆఫర్లు
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
వంద, యాభై నోట్లు ఉంటాయా?
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
మోదీ ఒక్కడే తెలివైనోడా?
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్
వంద విలువ తెలిసొచ్చిందట!
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి

Comments

comments