తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం

A Group of People getting Ready to protest in Telangana as Kapus in Ap

ప్రస్తుతం ఏపిలో కుల రగడ సాగుతోంది. అక్కడి పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. ఏపిలో కాపులకు రిజర్వేషన్లు, ప్రత్యేక నిధులు కల్పిస్తామని నాడు ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చి.. ఇన్నాళ్లు గడిచినా కానీ వాటి ఊసెత్తలేదు. దాంతో దీనిపై కాపులు ఉద్యమానికి నాందిపలికారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఏకంగా దీక్ష చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా అలాంటి పరిస్థితులు తెలంగాణలో లేకున్నా.. ఖచ్చితంగా అంతకన్నా దారుణ పరిస్థితులు ఎదురుకావడానికి మాత్రం ఛాన్స్ ఉంది.

తెలంగాణ కల సాకరమైన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని… అందుకు అవసరమైతే కేంద్రం నుండి కూడా అనుమతి తీసుకుంటామని అన్నారు. కానీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయినా కానీ దాని మీద కనీస చర్యలు కూడా తీసుకోలేదు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేసీఆఱ్ ఇప్పుడు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు.

ఏపిలో కాపు ఉద్యమం ఏవిధంగా అయితే తీవ్రంగా.. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందో అలాంటి ఇబ్బందికర పరిస్థితులు తెలంగాణలో కేసీఆర్ కు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయి. కాపులకు తగిన న్యాయం చెయ్యలేదని.. వారికి తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి విఫలమయ్యారు. ఇక్కడ తెలంగాణలో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటి వరకు కూడా దాని మీద మాట్లాడకపోవడం ఏమాత్రం మంచిది కాదు.

గతంలో అసెంబ్లీ సాక్షిగా ముస్లింలకు తగిన రిజర్వేషన్లు కల్పిస్తామని.. అందుకు అవసరమైతే తమిళనాడు తరహాలో కేంద్రం నుండి అనుమతులు తీసుకుంటామని కూడా అన్నారు. కానీ నాలుగు నెలల్లో సాధించి తీరుతాం అన్న కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఆ ఊసెత్తడం లేదు. దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. రంజాన్ నెలలో రెండు లక్షలమందికి దావత్ లు ఇవ్వడం కన్నా కూడా వారికి రిజర్వేషన్లు కల్పించి.. వారి అభివృద్దికి బాటలు వెయ్యాలని వారు కోరుతున్నారు.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
ఆ అరుపులేంటి..?
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
బాబు Khan
పట్టిసీమ వరమా..? వృధానా..?
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
మెరుపు దాడి... నిజమా-కాదా?
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
మోదీ భజన అందుకేనా?

Comments

comments