రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?

A Journalist Questioned Chandrababu On Special Status

ఏపీ ప్రజలను కేంద్రం బఫూన్‌లా చూస్తోందనడానికి నిదర్శనం.. నిన్న (07-09-2016) ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక సహాయం మాత్రమేనని ప్రకటించడమే. దీనిపై ప్రతిపక్షాల్లో, ప్రజల్లో, మీడియాలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్.. ఆసక్తికరంగా తన సోషల్ మీడియాలో పేజీలో ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పుడిది వైరల్‌గా వెళుతోంది. దీనికితోడు.. వేర్వేరు సందర్భాల్లో ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట్లాడిన వీడియోలను ప్రెజెంట్ చేశారు. ‘రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయింది’ అని ప్రశ్నించారు. ప్యాకేజీ అనేది పంచదార పూత అని, హోదా లేదన్నది చేదునిజమని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు మోసం బీజేపీది అని, అందులో భాగం పంచుకున్న దోషం తెలుగుదేశందని అభిప్రాయపడ్డారు.

ఇక వీడియోలో చంద్రబాబు నాయుడు మాటలు విన్నట్లైతే.. ఎన్నికల ప్రచారంలో కేంద్రం ఏపీకి స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు ఇచ్చారని, అది 15 సంవత్సరాలు ఇవ్వండని నరేంద్రమోడీని కోరారు. ఎందుకు 15 సంవత్సరాలు అవసరం అవుతుందో కూడా క్లియర్‌గా వివరించారు. పరిశ్రమలు రావడానికే 3 ఏళ్లు పడుతుందని, ఆ తర్వాత వాళ్ళు సెటప్ చేసుకుని ఆచరణలోకి తీసుకురావడానికి మరో ఐదేళ్లు పడుతుందని, దాని బెనిఫిట్స్ పొందడానికి మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. కానీ.. సీఎం అయిన తర్వాత చంద్రబాబు మడపతిప్పారు. ఎన్నికల ముందు స్టేటస్ గొప్పదనం గురించి ఢంకా బజాయించి చెప్పిన ఆయన.. ఇప్పుడదే ఢోలుకు బొక్కలు పెట్టేశారు. అసలు స్పెషల్ స్టేటస్ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నట్లుగా మాట్లాడారు. అంతేకాదు.. స్టేటస్ కన్నా ప్యాకేజీలు ఎక్కువ బెనిఫిట్స్ కేంద్రం ఇస్తామంటే.. ఎవరు కాదంటారని అభిప్రాయపడ్డారు.

తర్వాత అనేక రకాలుగా సన్నాయి నొక్కులు నొక్కి ప్రజలకు స్పెషల్ స్టేటస్ అవసరం లేదని మభ్యపెడుతూ.. చివరికి ఈ స్పెషల్ స్టేటస్‌తోనే రాష్ట్రం స్వర్గం అయిపోతుందని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయిని, అదే నిజమైతే పది పదిహేనేళ్ల నుంచి స్పెషల్ స్టేటస్‌లో ఉన్న రాష్ట్రాలు ఎందుకు స్వర్గాలైపోలేదని ఎదురు ప్రశ్నించారు బాబు.

ఈ విధంగా ఉన్న చంద్రబాబు, మోడీ వైఖరిని చూసి.. ప్రతి ఆంధ్రుడు తనకు జరిగిన, జరుగుతున్న అన్యాయానికి అంతకంతకు రగిలిపోతున్నాడు.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
చంద్రుడి మాయ Diversion Master
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
తొక్కితే తాటతీస్తారు
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
పైసలు వసూల్ కాలేదుగా..
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments