రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి

A Kid wrote a Letter to CM with blood

ఆ పాప పేరు లతికా బన్సాల్.. 14 ఏళ్ళు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో చదువుకొంటోంది. రెండు నెలల కిందట- జూన్ 14న ఆమె జీవితంలో మర్చిపోలేని ఘటన. జీవన పర్యంతం కళ్ళ ముందు కదలాడే ఘోరం జరిగింది. ఆమె తల్లి అనూ బన్సాల్ ను లతిక, ఆమె చెల్లెలు తాన్యా ల కళ్ళెదుటే సజీవదహనం చేశారు. మగపిల్లాణ్ణి కనలేకపోయావని  అనూను ఆమె అత్తమామలు, మరదలు దారుణంగా కిరోసిన్ పోసి నిప్పంటించేశారు. అమ్మ కోసం ఆ పాపలిద్దరూ ఏడ్చారు. లతిక వెంటనే పోలీసులకు 100 నెంబర్ కు ఫోన్ చేసింది. ఎవరూ పలకలేదు. తరువాత అంబులెన్స్ కు ఫోన్ చేసింది. అదీ రాలేదు. ఏం చేయాలో తెలీక దగ్గర్లోనే ఉన్న తన మామయ్యకు వెళ్ళి చెప్పింది. ఆయన వచ్చి అనూను ఆసుపత్రిలో చేర్పించాడు. అప్పటికే 95శాతం ఒళ్ళు కాలిపోయిన అనూ ప్రాణాలు కోల్పోయింది.

ఆ భయానక దృశ్యాన్ని ఆ చిన్నారి మర్చిపోలేకపోతోంది. పోలీసులు ఆ తర్వాత తాపీగా వచ్చారు. డబ్బులు ముట్టాయో ఏమో … అనూ బన్సాల్ ఆత్మహత్య చేసుకుందని రాసుకుని వెళ్ళిపోయారు. లతిక ఊరుకోలేదు. జరిగిన ఘోరాన్ని చెబుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఓ లేఖ రాసింది. న్యాయం కోసం తన మామ ప్రతీ పోలీస్ అధికారినీ కలిశాడని, అందరూ దీన్ని తేలిగ్గా తీసుకొని పంపేశారని అందులో పేర్కొంది.. “ఇవన్నీ చూశాక, నేను సీఎం సాబ్ కి లెటర్ రాశాను.. ఇంకు తో రాసిన దాన్ని ఆయన పట్టించుకోరేమోనని చివరగా నా రక్తంతో రాశాను. నన్ను మీ బిడ్డనే అనుకోండి, న్యాయం చెయ్యండన్నాను” అని లతిక ఏడుస్తూ చెప్పింది.

“నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ మా అమ్మను అత్తమామలు, మా నాన్న హింసిస్తూనే ఉన్నారు. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. మేం అద్దెకు వేరే ఇంట్లో ఉంటున్నాం. తాన్యా పుట్టాక పరిస్థితి మరీ ఘోరం. చివరకు మా నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకోడానికి సిద్ధమయ్యాడు. కొడుకు కోసం. ఆ రోజు అంతా వచ్చి మా అమ్మను కొట్టారు. విడాకులు ఇవ్వమన్నారు. మా అమ్మ ఎదిరించింది.. ఆ కోపంలో మా అమ్మను నిప్పంటించేశారు..తాన్యా ఏడుస్తూనే ఉంది..నేనే కాస్త ధైర్యం చేసి పోలీసులకు ఫోన్ చేశాను.. వారూ రాలేదు” అని లతిక చెప్పింది. ఈ విషయం మీడియాలో రాగానే బులంద్ షహర్ పోలీసులపై ఒత్తిడి పెరిగింది. అనూ బన్సాల్ భర్త మనోజ్ ను అరెస్ట్  చేశారు.

Related posts:
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
అంత దైర్యం ఎక్కడిది..?
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
తిరిగబడితే తారుమారే
బెంగళూరుకు భంగపాటే
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
బినామీలు భయపడే మోదీ ప్లాన్
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
అవినీతి ఆరోపణల్లో రిజిజు
రాసలీలల మంత్రి రాజీనామా
పాపం.. బాబుగారు వినడంలేదా?

Comments

comments