దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!

A Man Treats God As His Enemy and finally he Made a Shock

అందరికి దిక్కు ఆ దేవుడే.. ఏ కష్టం వచ్చినా ఆ దేవుడి చెబితే అతడు వాటిని దూరం చేస్తాడు.. ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనూ విన్న మాటలు. అయితే ఓ ప్రబుద్దుడు మాత్రం ఆ దేవుడి మీదే కోపం పెంచుకున్నాడు. తాను కొలుస్తున్న దేవుడు ఎంతకీ కరుణించడం లేదని అతడు పెంచుకున్న ద్వేషం చివరకు అతడు ఎవరూ చెయ్యని ఓ పని చేశాడు. దాంతో చివరకు మనోడు కటకటాలపాలయ్యాడు. ఇంతకీ దేవుడి మీద అంతలా కోపం, ద్వేషం పెంచుకోవడానికి కారణం ఏంటీ అనుకుంటున్నారా.? వాళ్లావిడ పుట్టింటికి వెళ్లిపోవడం.

అవును.. మీరు చదువుతున్నది అక్షరాల నిజం.తన భార్యతో గొడవపడ్డ ఓ మహానుభావుడు చివరకు దేవుడి మీద కోపం చూపించాడు. అయినా అందరు నమ్మే దేవుడి మీద అంతలా కోపం తెచ్చుకున్నది కూడా పెద్ద కారణంతో కాదు. కేవలం తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మనోజ్ బంజారా చేసిన నిర్వాకానికి అందరూ అవాక్కవుతున్నారు. పోలీసులు మాత్రం అతడి మీద కేసు నమోదు చేసి.. కటకటాలపాలు చేశారు.

మనోజ్ బంజారాతో అతడి భార్య గొడవపడింది. దాంతో గొడవ కాస్త చిలికిచిలికి గాలి వానగా మారింది. చివరకు భార్య అతడితో విసిగిపోయి తన పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్యను తిరిగి ఇంటికి తెచ్చుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఏదీ ఫలించలేదు. దాంతో దేవుడా నువ్వే దిక్కు.. నా భార్య ఇంటికి వచ్చేలా చూడు తండ్రి అని వేడుకున్పాడు. ఇండోర్‌లోని పల్డా ప్రాంతంలో ఉన్న ఖెడపటి హనుమాన్ దేవాలయానికి వెళ్లి రోజూ పూజలు చేసేవాడు. కానీ ఎన్నిరోజులైనా భార్య తిరిగిరాకపోవడంతో దేవుడిపై కోపం పెంచుకున్న మనోజ్ బంజారా చివరకు గుడికెళ్లి గుడిలోని హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి మీద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.

Related posts:
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
జగన్ అన్న.. సొంత అన్న
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
అడవిలో కలకలం
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
జయ మరణం ముందే తెలుసా?
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా అక్కినేని నాగార్జున అంశం
మోదీ మీద మర్డర్ కేసు!
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు

Comments

comments