కూతురిని చంపేసింది.. ఎందుకంటే

A Mother killed her Daughter

నవ మాసాలు కడుపులో మోసి.. పేగు పంచి జన్మనిచ్చిన కూతురిని పరువు కోసం చంపేసింది ఓ తల్లి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా జరిగే ఇలాంటి పరువు హత్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో విజయవాడలో కన్నపేగు మమకారాన్ని చంపుకుంది ఓ తల్లి. కుటుంబం పరువును బజారుకీడ్చి… రచ్చచేస్తుందన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కన్న బిడ్డ అన్న కనికరం లేకుండా నిర్దాక్షణ్యంగా చంపేసి కసి తీర్చుకుంది. నవ్యాంధ్ర రాజధాని అతి చేరువలో వాంబే కాలనీలో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది.

వాంబేకాలనీలో బేబీ జాన్‌ తన కూతురు షేక్‌ నజ్మాతో కలసి ఉంటుంది. నజ్మా కొన్నాళ్ల నుంచి దీపక్‌ అనే అబ్బాయ్‌తో కలసి తిరుగుతుందని, చెడు తిరుగుళ్లు తిరుగుతుందని బేబీ జాన్‌ అనుమానించింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి వాగ్వాదం కూడా జరుగుతుంది. చేస్తుంది మంచి పని కాదని, కుటుంబం పరువు బజారున వేయవద్దని నజ్మాను హెచ్చరించింది. అయినా ఫలితం లేకపోవడంతో గొంతు నులిమి చంపేసింది. ప్రియురాలి మృతి విషయాన్ని తెలుసుకున్న దీపక్‌… పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కన్నతల్లే తన ప్రియురాలు నజ్మాను పొట్టనపెట్టుకుందని విలపించారు. పరువు కోసం ఏకంగా కన్నబిడ్డను చంపేయడం ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు.

Related posts:
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
జగన్ అన్న.. సొంత అన్న
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
‘స్టే’ కావాలి..?
నయీం బాధితుల ‘క్యూ’
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
మంత్రుల ఫోన్లు బంద్
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
అడవిలో కలకలం
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
చంద్రబాబు చిన్న చూపు
ఏపీకి ఆ అర్హత లేదా?
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

Comments

comments