తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)

A Poor Son of a Rich father real Story

A Poor Son of a Rich father real Story. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

కోట్లు సంపాదించిన పెద్దల సంపాదనను రెట్టింపు చెయ్యడం లేదంటే.. మొత్తం ఊడ్చేయడం గురించి చాలా విన్నాం. కానీ సినిమాల్లోగా..నా సంపాదనతో కాదురా.. నువ్వు స్వంతంగా సంపాదించి చూపించు అని సినిమా డైలాగులు కొడితే.. హీరో రోషంతో వెళ్లి కోట్లు సంపాదించడం చూసి ఉంటాం. కానీ గుజరాత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి తన కొడుకుతో చేసిన ఛాలెంజ్. ఆ కొడుకు తీసుకున్న రిస్క్ గురించి తెలుసుకుంటే ఇలా కూడా ఉంటారా..? అని అనిపిస్తుంది. కానీ రియల్ స్టోరీ తెలుసుకున్న తర్వాత సినిమాలు రియల్ లైఫ్ నుండే వస్తాయని ఖచ్చితంగా నమ్ముతారు.

తన కొడుక్కి జీవితం, డబ్బు విలువ తెలియాలని..తనకాళ్లమీద తాను నిలబడగలిగే శక్తి తనకొడుక్కి రావాలని గుజరాత్ లోని సూరత్ కు చెందిన 6 వేల కోట్ల సంపాదన కలిగిన వజ్రాల వ్యాపారి డిసైడ్ అయ్యాడు.  అనుకున్నదే తడువుగా ఒక్కగానొక్క కొడుకు ద్రవ్య దలోకియాకు తన మనసులో మాట చెప్పాడు. అమెరికాలో ఎంబీఏ చదువుతున్న 21ఏళ్ల ద్రవ్య హాలీడే కోసమని ఇండియా వచ్చాడు. ‘సూటు బూటు వేసుకొని నేను సంపాదించింది అనుభవించడం కాదు…కష్టపడి డబ్బు సంపాదిస్తే ఆ కిక్కే వేరుఅంటూ తండ్రి చెప్పిన మాటల్ని ఛాలెంజ్ గా తీసుకున్నాడు. తండ్రి చెప్పిన మూడు షరతులు 1. కోటీశ్వరుడి తనయుడినని ఎక్కడా చెప్పవద్దు. అసలు తండ్రి గురించి ఎక్కడా ప్రస్తావించవద్దు. 2. పని చేసిన చోట వారం రోజులకు మించి ఉండరాదు. 3.అత్యవసరమైతే తండ్రి ఇచ్చిన రూ.7వేలు ఉపయోగించరాదు. మొబైల్ ఫోన్ ఎట్టిపరిస్థితుల్లో వాడరాదు. అంతే…ఆ కండీషన్లను ఒప్పుకొని గత నెల (జూన్) 21న భాష తెలియని, స్నేహితులంటూ ఎవరూ లేని కేరళలోని కొచ్చికి మూడు జతలతో చేరుకున్నాడు ద్రవ్య.

ఐదు రోజుల పాటు పనికోసం కొచ్చిలో తిరగని ప్లేసంటూ లేదు. అయినా ఎక్కడా పనిదొరకలేదు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన తాను అలాగే ప్రవర్తిస్తే ఉద్యోగం ఎవరిస్తారని తెలుసుకున్నాడు ద్రవ్య. గుజరాత్ కు చెందిన తాను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానని, తమది పేద కుటుంబమని, పని అత్యవసరమని కేరనెళ్లూరులోని ఓ బేకరి యజమానికి విన్నవించుకున్నాడు. ఆ రకంగా ద్రవ్య మొదటి ఉద్యోగం బేకరిలో మొదలైంది. వారం రోజులకు మించి ఒకే చోట పనిచేయకూడదు కదా..అందుకే కాల్ సెంటర్, చెప్పుల దుకాణం, మెక్ డోనాల్డ్స్ వంటి వాటిల్లో పనికి కుదిరాడు. అంత కష్టపడుతున్న ద్రవ్య నెలకు కేవలం 4వేలు మాత్రమే సంపాదించేవాడు. అసలే విలాసజీవితం గడిపినవాడు కావడంతో వచ్చే జీతంలో నుంచి ఒక్కో పూట రూ.40తో భోజనం చేస్తూ జాగ్రత్తగా ఖర్చుపెట్టేవాడు. అయినా తానుండే లాడ్జీలో రోజుకు 250 అవసరమయ్యేది. అప్పుడు జీవితం అంటే ఏమిటీ, పనికోసం, తిండికోసం ఎలా కష్టపడుతురోనని అనుభవం ద్వారా తెలుసుకున్నాడు.

‘పనిదొరకని ఆ ఐదు రోజులు ఎంతో ఆందోళన చెందాను. ఎక్కడుండాలో అర్థం కాలేదు. పనికోసం 60 దుకాణాలు, కంపెనీలు తిరిగినా ఫలితం లేకపోయింది. ఆసమయంలోనే ఉద్యోగం విలువ తెలిసొచ్చిందని’ ఆరోజులను నెమరేసుకుంటాడు ద్రవ్య. ‘జీవిత పాఠాలు ఏ యూనివర్సిటీ బోధించదు. ఇవన్నీ అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి. అదే నా కొడుక్కి చెప్పా’ అంటాడు ద్రవ్య తండ్రి, 71దేశాల్లో వజ్రాల వ్యాపారం చేసే ‘హరే క్రిష్ణ డైమండ్స్’అధినేత సవ్జీ దలోకియా అంటారు. అన్నట్లు ఉద్యోగుల వల్లే తన సంస్థ ఈస్థాయిలో ఉందంటూ వచ్చిన లాభాల్లో కొంతభాగాన్ని బోనస్ గా ప్లాట్లు, కార్లు బహుమతులుగా తన ఉద్యోగులు అందిచాడు సవ్జీ. ఇదంతా అప్పుడెప్పుడో వచ్చిన రజనీకాంత్ సినిమా అరుణాచలంలా అనిపించవచ్చు. కానీ ఇది నిజం.

Related posts:
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
బాబు Khan
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?

Comments

comments