సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ

A Tree in Siddipet

అనగనగా… సిద్దపేట అనే పట్టణం.. ఆ పట్టణానికి చెందిన నంగునూరు మండలం రాజ్ గోపాల్ పేట్ అనే ఓ గ్రామం.. ఆ గ్రామంలో ఓ పోలీస్ స్టేషన్.. ఆ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ చెట్టు.. ఆ చెట్టు రాజకీయ కథ గురించి మనం తెలుసుకుందా. అదేంటి చెట్టు రాజకీయ కథ ఏంటి.. ? పిచ్చి ముదిరింది అనుకుంటున్నారేమో.. చెట్టుకు నిజంగా రాజకీయ కథ లేకున్నా… ఇప్పుడు రాజకీయ సర్కిల్స్ లో మాత్రం ఇది బాగా పాపులర్ అయింది. ఇంతకీ ఎందుకు అంతలా దీనికి పాపులారిటీ వచ్చింది అనుకుంటున్నారా..? కేసీఆర్ వల్ల.

తెలంగాణ ముఖ్యమంత్ర కేసీఆర్ ఈ రోజు రెండో దశ హరతహారాన్నినల్గొండ జిల్లాలో ప్రారంభించారు. తెలంగాణలో కరువు సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి అంటే అది కేవలం అడవుల వల్లే అని కేసీఆర్ దూరదృష్టి. అందుకే హరితహారాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే సీఎం కేసీఆర్ 1996-97లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నంగునూరు మండలం రాజ్‌గోపాల్‌పేట పోలీసుస్టేషన్ ప్రారంభోత్సవంలో భాగంగా నాటిన మొక్క ఇది. ప్రస్తుతం మహావృక్షంలా ఎదిగింది. పోలీస్‌స్టేషన్‌కు పచ్చదనం పంచుతున్నది. ఫిర్యాదుదారుల సేద తీర్చుతున్నది. ఇలా నాడు నాటిన మొక్క.. ఇప్పుడు చెట్టై ఎంతో మందికి నీడనిస్తోంది అని అన్ని న్యూస్ ఛానల్స్ లో వార్తలు వచ్చాయి. దాంతో రాజకీయ సర్కిల్స్ లో కూడా దీనిపై చర్చసాగింది.

రెండో దశ హరితహారాన్ని ఆయన నల్గొండ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. హరిత తెలంగాణ సాధన కోసం అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. లక్షన్నర మొక్కలు ఒకేసారి నాటడం గొప్ప సాహసోపేతమని పేర్కొన్నారు. అందరూ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సీఎం నుంచి విద్యార్థుల వరకు అందరూ ఈ హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కవులు, కళాకారులు కూడా ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. పది రోజులపాటు అందరూ అవిరళంగా కృషి చేయాలన్నారు. పది రోజులు కష్టపడినా మొక్కలు పెరగలేదనే అపవాదు రాకుండా వాటిని కాపాడాలని సూచించారు

Related posts:
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
పెట్రోల్ లీటర్‌కు 250
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
అతడికి గూగుల్ అంటే కోపం
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
బాబోయ్ బాబు వదల్లేదట
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
సల్మాన్ ఖాన్ నిర్దోషి
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
ఓడినా విజేతనే.. భారత సింధూరం
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
సన్మానం చేయించుకున్న వెంకయ్య
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే

Comments

comments