ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ

AAP MP Bhagavat Man video bring strom in Parliament session

బాధ్యతగల ఎంపీగా ఉంటూ పార్లమెంట్ సెక్యూరిటీ వ్యవహారాలను సీక్రెట్ కెమెరాతో షూట్ చేసిన ఓ ఎంపీపై పార్లమెంట్ అట్టుడికింది. ఆమ్ ఆద్మీ ఎంపీ భగవత్ మాన్ ను తీవ్రంగా తప్పుబట్టాయి అధికార బీజేపీ, అకాలీదళ్ పార్టీ వర్గాలు. పార్లమెంట్ కార్యకలాపాలను చిత్రీకరించిన వీడియోను ఎంపీ భగవంత్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో దీనిపై వివాదం మరింతగా రగులుతోంది. దీంతో భగవత్ మాన్ సభా హక్కులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పట్టుబట్టారు బీజేపీ నేతలు.

ముక్తార్ అబ్బాస్ నఖ్వి, హరసిమ్రత్.. భగవంత్ చిత్రీకరించిన వీడియో ఒకవేళ ఉగ్రవాదుల చేతిలోకి వెళితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. పార్లమెంట్ కార్యకలాపాలను చిత్రీకరించడం తీవ్రంగా తప్పుబట్టిన కేంద్రమంత్రులు దీని వెనుక అసలు ఉద్దేశమేంటో విచారణ ద్వారా తేల్చాలని డిమాండ్ చేశారు.అయితే వీడియో చిత్రీకరణపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు ఎంపీ భగవత్. తాను పార్లమెంటు భద్రతకు భంగం కలిగించే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడలేదని, కేవలం జీరో అవర్ లో విపక్షాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే వీడియో తీశానని వివరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాల సమయంలో జరిగే చర్చలు కాస్త లక్కీ డ్రా తరహాలో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts:
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
బాబోయ్ బాబు వదల్లేదట
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
నయీం బాధితుల ‘క్యూ’
ఈ SAM ఏంటి గురూ..?
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
సల్మాన్ ను వదలని కేసులు
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి

Comments

comments