ఆ అద్భుతానికి పాతికేళ్లు

Aditya 369 completed 25 years

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అపురూప, అద్భుత సినిమాలు వచ్చాయి. అప్పట్లోనే మన వాళ్లు వాడిన టెక్నాలజీ అంతా ఇంతా కాదు. నాటి పౌరాణిక సినిమాల్లో వాళ్లు చూపించిన విధానం ఇప్పటికీ ఓ అద్భుతమే. పాతాళ భైరవిలో చూపించిన విజువల్స్ ఇప్పుడు ఎంత గ్రాఫిక్స్ లో చేసినా అలా రావు. మరి అంత చరిత్ర ఉన్న తెలుగు సినిమా చరిత్రలో ఖచ్చింతగా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే సినమా బాలకృష్ణ ఆదిత్య 369. క్రియేటివ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ తీసుకున్న అద్భుత కథ, అన్నింటికి మించిన విజువలైజేషన్ అందరిని కట్టిపడేసింది. మరి అలాంటి అపురూప చిత్రం విడదలూ 25 ఏళ్లు గడిచాయి.

1991 జులై 18న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం ఇవాళ్టితో 25ఏళ్లు పూర్తి చేసుకుంది. నందమూరి నటసింహం బాలయ్య హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. . తెలుగు సినిమా ఖ్యాతిని భారతదేశమంతా విస్తరించారు. టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించగలమని… 90లలోనే చాటిచెప్పిన మూవీ అది ‘బ్యాక్‌ టు ఫ్యూచర్‌’, ‘టైమ్‌ ఆఫ్‌ ది టైమ్‌’, ‘టైమ్‌ మెషిన్‌’ లాంటి సినిమాల స్ఫూర్తితో ఆదిత్య 369కథని తయారు చేశారు సింగీతం. టైమ్ మెషిన్ సినిమాలో విక్టోరియా మహారాణి కాలానికి వెళితే… దీనిలో శ్రీకృష్ణదేవరాయల కాలానికి తీసుకువెళ్లారు. కథ సమయంలోనే హీరోగా బాలకృష్ణను అనుకున్నారట సింగీతం. అటు కృష్ణదేవరాయలుగా… ఇటు కృష్ణకుమారుడిగా రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు బాలయ్య. తెనాలి రామలింగ కవి పాత్రలో చంద్రమోహన్ నటన ఆకట్టుకుంది.

ఆదిత్య 369 సినిమా 2 గంటల 24 నిమిషాల నిడివితో ఈ సినిమా తీశారు. జంధ్యాల డైలాగులు వహ్వా అనిపిస్తాయి. ఇక వీఎస్ఆర్ స్వామి ఫొటోగ్రఫీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. గౌతమ్ రాజు ఎడిటింగ్ కూడా ప్రశంసలు అందుకుంది. ఆదిత్య 369ను 110 రోజుల్లో రూ.1.50 కోట్లతో సినిమా పూర్తి చేశారు. అప్పట్లోనే 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. చిరంజీవి, విజయశాంతి లాంటి స్టార్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాలుపంచుకున్నారు. హిందీలో  ‘మెషిన్‌-369’ పేరుతో, తమిళంలో ‘అపూర్వ శక్తి 369’ పేరుతో విడుదలై చిత్రం విజయాన్ని సొంతం చేసుకొంది.  త్వరలో ఈసినిమా సీక్వెల్ కూడా రాబోతోందని వార్తలు వస్తున్నాయి.

తెలుగు సినిమా గురించ మూడు ముక్కల్లో చెప్పమంటే.. ఒక మాయాబజార్.. ఒక ఆదిత్య 369… ఒక బాహుబలి.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
పవన్ మాస్టర్ స్కెచ్
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
పట్టిసీమ వరమా..? వృధానా..?
మూడింటికి తేడా ఏంటి..?
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
ప్రత్యేక హోదా లాభాలు
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
మోదీ భజన అందుకేనా?
జయ మరణం వెనక ఆ మాఫియా?

Comments

comments