జయ మరణం ముందే తెలుసా?

Jaya death

అవును, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం గురించే ముందే తెలుసా? అది కూడా ఏకంగా సంవత్సరం ముందు తెలుసా? అనే ప్రశ్నలు ఇప్పుడు తమిలనాట బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఎన్నో కోట్ల మందికి ఆరాధ్యదైవంగా మారిన జయ మరణం గురించి ఏకంగా సంవత్సరం ముందు తెలుసా? అనే వార్త ఇప్పుడు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తలరాతనో లేదంటే యాదృచ్ఛికమో తెలియదు కానీ సంవత్సరం ముందు ఏదైతే రాశారో, జయ విషయంలో అదే జరిగింది అని అందరూ చర్చించుకుంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

తమిళనాట డిసెంబర్ నెల అంటే ఎంతో  సెంటిమెంట్. చాలా మంది ఈ డిసెంబర్ నెల అంటేనే హడలిపోతున్నారు. తమిళనాడుకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ నెలలోనే కన్నుమూశారు. అంతేగాక ప్రకృతి విలయాలు కూడా డిసెంబర్ నెలలోనే ఎక్కువగా జరిగాయి. ఈ డిసెంబర్ నెల గురించి ఓ క్యాలెండర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే చెన్నైలోని ఓ దుకాణం తమ ఖాతాదారులకు ఇచ్చేందుకు ఈ ఏడాది ప్రారంభంలో 2016  డే వైస్ క్యాలెండర్‌ను ముద్రించింది. ఒక్కో తేదీ చీటిపై ఓ తాత్వికతతో(ఫిలాసఫీ లైన్) ముడిపడిన వ్యాఖ్యలను తమిళంలో ముద్రించింది. అయితే ఇప్పుడు అవే వార్తల్లో నిలుస్తున్నాయి.

Jaya death calender

అలా ముద్రించిన ఆ క్యాలెండర్ లోని డిసెంబర్ 5వ తేదీ చీటిపై కూడా ‘ఓ గదిలో మరణం… పక్క గదిలో వారసత్వం కోసం గొడవ’ అనే అర్థం వచ్చే విధంగా వ్యాక్యాలను తమిళంలో ముద్రించింది. తాజాగా తమిళనాడు సిఎం జయలలిత అపోలో ఆసుపత్రిలోని ఐసియులో చికిత్స పొందుతూ మృతి చెందడం, అదే టైంలో  పక్క గదిలో పన్నీర్ సెల్వం నాయకత్వంలో అన్నాడిఎంకె ఎంఎల్‌ఎలు భేటీ అయి… అమ్మ వారసుడి కోసం మంతనాలు జరిపారు. దీంతో అమ్మ విషయంలో ఇది సరిగ్గా సరిపోయిందని తమిళ జనాలు బలంగా నమ్ముతున్నారు.  ఇలా సిట్యువేషన్ కు తగ్గట్టుగా ఉన్న ఆ క్యాలెండర్ చీటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
బాబు బిత్తరపోవాల్సిందే..
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
వంద, యాభై నోట్లు ఉంటాయా?
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
పవన్ పంచ ప్రశ్నలు
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
దేశభక్తి అంటే ఇదేనా?
బీసీసీఐకి సుప్రీం షాక్
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments