జియోకు 9900 కోట్లు కట్టాల్సిందే… ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియాలకు షాక్

Airtel, Vodafone, Idea has to pay 9,900 Crore For Jio Call Drop

దేశ టెలికాం రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న జియో ఇప్పుడు మిగిలిన నెట్‌వర్క్‌లకు చమటలు పట్టిస్తోంది. ఇప్పటికే ఫ్రీ కాలింగ్ అని జనాలకు పిచ్చెక్కించిన జియో.. ఇప్పుడు ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియాలకు కూడా షాకిచ్చింది. జియో దెబ్బకు తమ కస్టమర్లు వేరే నెట్ వర్క్ లకు మారుతున్నారని, అన్ని నెట్ వర్క్ ఆపరేటర్లు కలిసి చేసిన ఓ నిర్వాకానికి జియోకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. కోర్టు ద్వారా జియోకు 9900 కోట్లు చెల్లించాలని ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియాలకు తాఖీదులు అందాయి. అసలు ఎందుకు ఆ 9900కోట్ల ఫైన్ అనుకుంటున్నారా..?

రిలయన్స్ జియోకు షాకిచ్చేందుకు ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియాలు కలిసి కాల్ డ్రాప్ ప్లాన్ వేశాయి. జియో నుంచి వచ్చిన కాల్స్ ఈ మూడు నెట్ వర్క్ లలో ఏ కాల్ వచ్చినా వెంటనే కాల్ డ్రాప్ అవుతోంది. దీంతో జియో కస్టమర్లు ఫిర్యాదు చెయ్యడం.. దీనిపై వెంటనే జియో కంపెనీ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై స్పందించిన కోర్టు ప్రతి నెట్ వర్క్ కు 3300 కోట్లు ఫైన్ వేసింది.అలా మూడు నెట్‌వర్క్ లు కలిసి 9900 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. కాగా ఈ ఫైన్ ను కట్టలేనిపక్షంలో ట్రాయ్ ద్వారా లైసెన్స్ లపై కూడా కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాపం జియో దెబ్బకు ఇప్పటికే కస్టమర్లను పొగొట్టుకున్నామని ఏడుస్తున్న నెట్‌వర్క్ ఆపరేటర్లు ఇప్పుడు కాసులు కూడా పొగొట్టుకుంటున్నారు.

Related posts:
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
కాటేసిందని పాముకు శిక్ష
వీళ్లకు ఏమైంది..?
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
పోరాటం అహంకారం మీదే
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
సల్మాన్ ను వదలని కేసులు
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
తెలంగాణ 3300 కోట్లు పాయె
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
బినామీలు భయపడే మోదీ ప్లాన్
బాత్ రూంలో గోడ.. గోడలో?? షాకే
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా అక్కినేని నాగార్జున అంశం
వాళ్లకు ఇదే చివరి అవకాశం
వంద విలువ తెలిసొచ్చిందట!
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
గుదిబండగా మారిన కోదండరాం
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?

Comments

comments