దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్

Ajit Doval is the India's James Bond

నిన్న ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ లోకి దూసుకెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టడం అందరికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. దేశం మొత్తం భారత ఆర్మీకి మద్దతుగా నిలిచింది. నరేంద్ర మోదీ పాకిస్థాన్ కు గట్టి సమాధానమిచ్చారని ఒక్క ఘటనతో తేలిపోయింది. కాగా మోదీ తర్వాత భారత్ దాడికి కారణమైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాపులర్ అయ్యారు. ఇప్పుడు దేశం మొత్తం అజిత్ ధోవల్ పేరు మారుమోగుతోంది. సైనిక చర్యల్లో ముందుండి నడిపించి.. ఆవేశంతో ఉన్న భారత యువతకు మేము ఆ పనిలోనే ఉన్నామని చేసి చూపించాడు దోవల్. ఈ పథకానికి వారం రోజుల ముందునుంచే ప్లాన్ ప్రిపేర్ అయ్యింది. కానీ ఒక్కో అడుగు పడటానికి కాస్త టైమ్ పట్టింది అంతే.

యూరీ ఎటాక్ కు ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా అని ఎదురుచూస్తున్న భారతీయులకు తీపి వార్తను అందించిన ఘనుడు ఈయన. ఇండియన్ జేమ్స్ బాండ్ గా అందరితో ప్రశంసలు అందుకుంటున్నఅజిత్ దోవల్ ను వ్యూహాత్మకంగా తన టీమ్ లోకి తీసుకున్నారు మోడీ. సరిహద్దుల్లో జరుగుతున్న వాటిని నిశితంగా పరిశీలిస్తూ.. పాక్ చర్యలపై తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి వ్యూహరచన చేశారు. అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. పాకిస్థాన్ కూడా ఎన్నోసార్లు అజిత్ ధోవల్ ఖచ్చితంగా తమ దేశానికి చేటు చేస్తుంది అని ఎన్నోసార్లు వెల్లడించింది.

దోవల్ చేసిన అత్యద్భుతాలు
– 1988 పంజాబ్‌లోని ఆపరేషన్ బ్లాక్ థండర్ ను సక్సెస్ చేసింది ఈయనే. ప్రార్థనామందిరంలో దాగున్న ఉగ్రవాదులతో రిక్షా కార్మికుని వేషంలో మాట్లాడి లొంగిపోయేలా చేశారు.
–  పాకిస్థానీ ముస్లిం పౌరుడిలా ఆయన పాక్‌లో ఏడు సంవత్సరాలు గడిపారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు, ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య ఉన్న అనుబంధాన్ని అతి దగ్గరగా చూశారు. కీలక సమాచారాలన్నీ రాబట్టారు.
– పఠాన్‌కోట్‌ దాడుల్లో మిలటరీకి చేదోడువాదోడుగా ఉన్నారు.
– ఇప్పుడు పీవోకేలో భారత దళాల మెరుపుదాడుల వెనక కీలకపాత్ర.
– 1971-99 మధ్య భారత్‌లో జరిగిన 15 విమాన హైజాకింగ్‌ యత్నాలను ఆయన ఆధ్వర్యంలోని భద్రతాదళాలు అడ్డుకొని కుట్రదారుల యత్నాలను భగ్నం చేశాయి.

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరు చెబితే పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయన పేరు వింటేనే పాకిస్థాన్‌ పాలకులకు వణుకు పుడుతోంది.దోవల్ ఆవులిస్తే పేగులు లెక్కపెడతాడంటూ పాక్ టీవీ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అజిత్ దోవల్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే శతృదేశాలకు వెన్నులో వణుకు పుట్టడం సహజమే అనిపిస్తుంది. మోడీకి అత్యంత విశ్వసనీయుడైన దోవల్‌ భారత ఇంటలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. పాకిస్థాన్ లాంటి దేశానికి వణుకుపుట్టించిన ఈ రియల్ లైఫ్ జేమ్స్ బాండ్ అంటే పాకిస్థాన్ లో ఇప్పటికీ చాలా మంది ప్యాంట్లు తడుపుకుంటారు.

Related posts:
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
ఆ అరుపులేంటి..?
టాప్ గేర్ లో ముద్రగడ
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
మెరుపు దాడి... నిజమా-కాదా?
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
పైసలు వసూల్ కాలేదుగా..
జయలలిత జీవిత విశేషాలు
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments