తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా అక్కినేని నాగార్జున అంశం

Akkineni Nagarjuna's topic in Telangana Assembly

తెలంగాణ అసెంబ్లీలో వేడివేడి చర్చ మొదలైంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా మొదలైన సభలో అప్పుడే ప్రతిపక్ష, అధికారపక్షాల మధ్య తీవ్ర చర్చసాగింది. అయితే తెలంగాణ అసెంబ్లీలో హాట్ హాట్ గా సినిమా నటుడు నాగార్జున అంశం సాగింది. అక్కినేని నాగార్జున విషయంలో సభ ఉడికిపోయింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డికి, మంత్రి హరీష్ రావుకు మధ్య జరిగిన ఆసక్తికర అంశాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అదేంటి తెలంగాణ అసెంబ్లీలో అక్కినేని నాగార్జున అంశం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? అయితే మొత్తం ఆర్టికల్ చదవండి.

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగుతున్నాయి. అందులో భాగంగా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు. మిష‌న్ కాక‌తీయ‌ తొలి ద‌శలో ఎన్ని చెరువులు పున‌రుద్ధ‌రించారని అడిగారు. ఫేజ్ 1లో జ‌రిగిన ప‌నుల‌పై వివ‌రాలు తెల‌పాల‌ని ప్ర‌శ్నించారు. సినిమా హీరోల‌ని అభిమానులు ఓ రోల్ మోడ‌ల్‌గా తీసుకుంటార‌ని, అటువంటి వారు అక్ర‌మాల‌కు పాల్ప‌డితే ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని అడిగారు. ఎన్ క‌న్వెన్ష‌న్ అక్ర‌మాల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదని ప్ర‌శ్నించారు. అక్కినేని నాగార్జున ఆక్ర‌మించుకున్న చెరువుల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదని సూటిగా అడిగారు. ఏ శక్తులు అడ్డుపడుతున్నయో చెప్పాలని అన్నారు. ములుగు డివిజ‌న్ అక్ర‌మాలు ప్రభుత్వం దృష్టికి వ‌చ్చాయా? అని అడిగారు. మిష‌న్‌ కాక‌తీయ‌కు ఎంత డ‌బ్బు కేటాయించారని, ఇప్ప‌టివ‌ర‌కు ఎంత ఖ‌ర్చు పెట్టారని అడిగారు. మొత్తానికి అసెంబ్లీలో అక్కినేని నాగార్జున అంశం వాడివేడిగా సాగింది.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
చెరువుల్లో ఇక చేపలే చేపలు
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
ఆయన మాట్లాడితే భూకంపం
ఒక్క రూపాయికే చీర
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్

Comments

comments