ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్

Akshay Kumar tweet on Political Surgical strike drama

దేశం మొత్తం ఒకటే చర్చ. భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసిందా..? లేదా..? అయితే నిజానికి ఇది కేవలం కొంత మంది మెదడులో వచ్చిన రాజకీయ దురుద్దేశం మాత్రమే. అయితే భారత ఆర్మీ చెప్పిన  సర్జికల్ స్ట్రైక్ పై అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు తమకు ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లందరికీ స్ట్రాంగ్ గా క్లాస్ పీకాడు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. తను ఉద్వేగంతో చెప్పిన మాటల్ని నిన్న రాత్రి తన ట్విట్టర్లో పెట్టాడు.

‘‘నేనొక స్టార్ లాగో, సెలబ్రిటీలాగే మాట్లాడదలుచుకోలేదు. ఒక భారత ఆర్మీ సోల్జర్ కొడుకుగా మాట్లాడదలుచుకున్నాను. ఈ మధ్య చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. వార్తల్లో, పేపర్లలో, మన దేశం గురించి, మన సైనికుల గురించి మన వాళ్లే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకరు సర్జికల్ స్ట్రైక్స్ కు ఫ్రూఫ్ ఏది అని అడుగుతారు. ఒకరు ఆర్టిస్టులను బ్యాన్ చేయాలంటూ మాట్లాడతారు. కొంత మంది యుద్ధం వస్తుందా అంటూ భయపడుతుంటారు. చాలు..ఇక ఇలాంటి నాన్సెన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టండి. వీటన్నింటి గురించి తర్వాత ఆలోచించవచ్చు గానీ, ఇప్పటికే మీ కోసం తన ప్రాణాలు అర్పించిన సైనికుల గురించి ఆలోచించండి. ఉరీ దాడుల్లో బారాముల్లాలో వీరమరణం పొందిన నితిన్ యాదవ్ గురించి ఆలోచించండి. అతని కుటుంబం గురించి, అలాంటి కొన్ని వేల కుటుంబాల గురించి ఆలోచించండి. దేశ రక్షణ బాధ్యతల్లో ఉన్న సైనికులకు ఈ సినిమా రిలీజవుతుందా..ఈ సినిమా బ్యాన్ అవుతుందా..? లేక దేశంలో ఏం జరుగుతుంది..లాంటి వేమీ వాళ్లకు తెలియదు. వాళ్లకు తెలిసింది కేవలం ఒకే ఒక్కటి. అది దేశ భవిష్యత్తు. వాళ్లు దేశం కోసం ఆలోచిస్తుంటే, మనం వాళ్ల వర్తమానం గురించి ఆలోచించాలి. వాళ్లు ఉంటేనే నేనైనా, మీరైనా ఎవరైనా ఉండేది. వాళ్లు లేకపోతే మనమెవ్వరం లేము. అసలు భారతదేశమే లేదు. జైహింద్..! ” అంటూ ఆవేశంగా, ఉద్వేగంగా తన ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు అక్షయ్ కుమార్.

Related posts:
ఇదో విడ్డూరం
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
అతడికి గూగుల్ అంటే కోపం
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
గెలిచి ఓడిన రోహిత్ వేముల
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
తెలంగాణ 3300 కోట్లు పాయె
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
చెబితే 50.. దొరికితే 90
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్

Comments

comments