5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే

Akshayapatra Foundation Behind Anna Canteen and Five Rupee Meals in Hyderabad

దేశంలో ఎక్కడ ఏ మంచి పథకం వచ్చి.. అంత పాపులర్ అయినా వెంటనే మన తెలుగు రాష్ట్రాల్లో పేరుమార్చుకొని మనకు కనిపిస్తుంది. తాజాగా ఏపి ప్రభుత్వం ఎంతో ఘనంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లు కూడా అంతే. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ఇన్స్పిరేషన్ తో చంద్రబాబు ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. పైగా కొత్త రాజధానిలో ఉద్యోగులకు, అక్కడి స్థానికులకు ఇది ఖచ్చితంగా మంచి చేస్తుంది అనే నమ్మకంతో దీన్ని ప్రారంభించారు. కేవలం రూపాయికే ఇడ్లీ, మూడు రూపాయలకు టొమాటొ బాత్, పొంగలి అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

ప్రస్తుతం అమరావతి చేరుకుంటున్న వాళ్లు అన్న క్యాంటీన్ల గురించి తెగ చర్చించుకుంటున్నారు. అతి తక్కువ ధర.. అదిరిపోయే టేస్ట్‌ ఉండటంతో ఉదయం నుంచే క్యాంటీన్‌ ముందు జనం క్యూ కడుతున్నారు.. ఉదయం ఏడున్నరకు ప్రారంభయ్యే ఈ క్యాంటీన్‌లో రూపాయికే ప్లేట్‌ ఇడ్లీ… మూడు రూపాయలకే టొమాటో బాత్‌… అదే ధరకు పొంగల్‌… టిఫిన్‌గా ఇస్తున్నారు.. పదకొండున్నర గంటల నుంచి భోజనం మెనూ స్టార్ట్ చేస్తున్నారు.. 5రూపాయలకు పులిహోర… అదే రేటుకు సాంబార్‌ అన్నం.. 3 రూపాయలకు పెరుగన్నం పెడుతున్నారు.. రుచి కూడా అద్భుతంగా ఉండడంతో.. తెచ్చిన గంటలోపే ఈ పదార్థాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి.

మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడో అనుకొని.. ఇప్పుడు ప్రారంభించిన అన్న క్యాంటీన్ల నిర్వహణ నిజానికి ప్రభుత్వానిది కాదు. అలాగే తెలంగాణలో ప్రభుత్వం ప్రారంభించిన ఐదు రూపాయలకు భోజనం పథకం నిర్వహణ కూడా ప్రభుత్వానిది కాదు. కానీ జిహెచ్ఎంసీ దీని నిర్వహణలో భాగస్వామిగా ఉంది అంతే. మరి ఇటు తెలంగాణలో ైదు రూపాయలకు భోజనం, అటు అమరావతిలో తక్కువ రేట్ కే రకరకాల రుచికరమైన వంటకాలను వండిస్తున్నది ఎవరు అనుకుంటున్నారా.? ఎంతో మంది అన్నార్థుల ఆకలి తీరుస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్.

అక్షయపాత్ర ఫౌండేషన్‌

ఇంతకీ ఇంతటి రుచికరమైన ఆహారాన్ని వండి వారుస్తున్నదెవరు..? పేరుకు ప్రభుత్వ పథకమే అయినా నిర్వాహకుల నేపథ్యం ఏంటి..? అన్న క్యాంటీన్‌ను అక్షయపాత్ర ఫౌండేషన్‌ నిర్వహిస్తోంది. ఇస్కాన్‌ సంస్థ ఆధ్వర్యంలో అక్షయపాత్ర ఫౌండేషన్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా 15లక్షలమంది స్కూల్‌ పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఫౌండేషన్‌… ప్రపంచంలోనే అతి భారీస్థాయిలో అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తోంది.. దేశంలోని 11 రాష్ట్రాల్లో పదివేల 550 స్కూళ్ల విద్యార్థులకు అన్నం పెడుతోంది.. ఆహారం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడని ఈ సంస్థ… పోషకాలతోకూడిన వేడి వేడి ఆహార పదార్థాలతో చిన్నారుల కడుపు నింపుతోంది మొన్న హైదరాబాద్ లో.. నేడు రాజధాని అమరావతి పరిసరాల ప్రజలకు.. అన్న క్యాంటీన్‌ ద్వారా.. తనదైన నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తూ.. వారి ఆకలిని తీరుస్తోంది.. అక్షయపాత్ర ఫౌండేషన్‌.

కానీ మన నాయకులకు మాత్రం తమకు పబ్లిసిటీ తీసుకువచ్చే వాటి గురించి తప్ప.. నిజంగా పబ్లిక్ కు మేలు చేస్తున్న వాటి గురించి మాత్రం చెప్పరు. దీన్నే చెట్టు పేరు చెప్పి కాయలమ్మడం అని అనాలేమో. అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న సేవను తమ సేవ అన్నట్లు చూపిస్తున్నారు నాయకులు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐదు రూపాయలకే భోజనం పెట్టించాం అని ప్రచారం చేసింది. ఇక ఏపిలో అన్న క్యాంటీన్ పేరుతో ఎన్టీఆర్ పేరునే బ్రాండ్ గా చేసింది.

Related posts:
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
పవన్ మాస్టర్ స్కెచ్
చంద్రుడి మాయ Diversion Master
మూడింటికి తేడా ఏంటి..?
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
మీకో దండం.. ఏం జరుగుతోంది?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!
జయలలిత జీవిత విశేషాలు

Comments

comments