మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు

telangana-dists

తెలంగాణ సర్కార్ తెలంగాణను మరింత పరిపారలన సౌలభ్యం కోసం జిల్లాలుగా విభజిస్తోంది. అందులో భాగంగా పాత జిల్లాలకు కొన్ని కొత్త జిల్లాలను కలుపుతూ మొత్తం 27 జిల్లాలతో తెలంగాణ రూపురేఖలను మార్చేప్రయత్నం చేస్తోంది తెలంగాణ సర్కార్. కేసీఆర్ ముందు ప్రకటించిన కొత్త జిల్లాలను తెలంగాణ సర్కార్ అధికారికంగా ప్రకటించేసింది. దసరా నాటికి కొత్త జిల్లాలు ఉనికిలోకి వస్తాయని కేసీఆర్ ప్రకటించారు.

అసలు కొత్త జిల్లాలు ఎన్ని, ఏఏ కొత్త జిల్లాలు, వాటి రూపు రేఖలు ఎలా ఉన్నాయి అన్న అంశాలను తెలుగోడ ప్రత్యేకంగా అందిస్తోంది.

1. ఆదిలాబాద్ (ADILABAD)
ఇది ఇంతకు ముందే తెలంగాణలో ఓ జిల్లాగా గుర్తింపు ఉంది. తెలంగాణలో అతి పెద్ద జిల్లా ఆదిలాబాద్. జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా ఆదిలాబాద్ జిల్లానే పెద్ద జిల్లాకావడం విశేషం.

adilabad

2. నిర్మల్ (NIRMAL)
ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. నిమ్మనాయుడు అనే రాజు పలిపాలించాడు. నిర్మల్ బొమ్మలకు పెట్టింది పేరు.

nirmal

3. కొమరంభీం (KOMARAM BHEEM)
ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లిలను కలిపి కొమరం భీం జిల్లాగా ఏర్పాటు చెయ్యాలని తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తోంది.

komaram-bheem

4. జగిత్యాల (JAGTIAL)
కరీంగనర్ లోని జగిత్యాల జిల్లాగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది. 1952లోనే జగిత్యాల మున్సిపాలిటీ ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడింది.

jagtial

5. నిజామాబాద్ (NIZAMABAD)
తెలంగాణలో ఓ ముఖ్యమైన నిజామాబాద్ ఇప్పటికే జిల్లా హోదాను కలిగి ఉంది. కేంద్రం ప్రకటించిన 100 స్మార్ట్ సిటీల్లో నిజామాబాద్ కూడా ఒకటి.

nizamabad

6. పెద్దపల్లి (PEDDAPALLE)
తెలంగాణలో రాజకీయంగా ఎంతో ప్రసిద్ది చెందింది పెద్దపల్లి. ఎంపీ వివేక్, బాల్క సుమన్ లు ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండే ఎంపీలుగా ఉన్నారు.  పెద్దపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి పెద్దపల్లి జిల్లాగా మార్చారు.

peddapalle

7. కామారెడ్డి (KAMAREDDY)
హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న ఈ నియోజక వర్గం ముందు నుండి మంచి రెవెన్యూ కేంద్రంగా ఉంటోంది. నిజామాబాద్ జిల్లాలో కీలకమైన కామారెడ్డిని జిల్లాగా చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

kamareddy

8. కరీంనగర్ (KARIMNAGAR)
ముందు నుండి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జిల్లా. కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో జిల్లా కేంద్రం ఉంది.

karimnagar

9. జయశంకర్ (ACHARYA JAYASHANKAR)
ఆచార్య జయశంకర్ స్మారకార్థం వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి కేంద్రంగా ఈ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు.

jaya-shankar

10. సిద్దిపేట (SIDDIPET)
వరంగల్ జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ది చెందిన పట్టణంగా సిద్ధిపేట ఉంది. ముందు నుండి తెలంగాణవాదం ఇక్కడ చాలా బలంగా వినిపించింది. తాజాగా సిద్ధిపేట చుట్టుపక్కలి ప్రాంతాలను కలుపుతూ టి సర్కార్ జిల్లాను ఏర్పాటు చేస్తోంది.

siddipet

11. హన్మకొండ (HANMAKONDA)
రాజకీయంగానే కాకుండా చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యతను కలిగిన హన్మకొండ జిల్లాను తెలంగాణ సర్కార్ అన్ని కోణాల్లో ఆలోచించి జిల్లాగా ఏర్పాటు చేస్తోంది.

hanamkonda

12. మెదక్ (MEDAK)
హైదరాబాద్ కాకుండా తెలంగాణలో ఎక్కువ ఆర్థిక వనరులు, పరిశ్రమలను కలిగిన జిల్లాగా మెదక్ కు మంచి గుర్తింపు ఉంది.

medak

13.  సంగారెడ్డి (SANGAREDDY)
నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ లను కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు.

sangareddy

14. మల్కాజిగిరి (MALKAJGIRI)
హైదరాబాద్ లోని అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా పేరున్న మల్కాజిగిరిని కొత్తగా జిల్లాగా ఏర్పాటు చేస్తోంది.

malkajgiri

15. యాదాద్రి (YADADRI)
గతంలో ఉన్న యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చారు. యాదాద్రి చుట్టుపక్కలి ప్రాంతాలను కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. భోన్ గిరి, జనగాంలు ఈ జిల్లాలో రెవెన్యూ డివిజన్లుగా ఉంటాయి.

yadadri

16. వరంగల్ (WARANGAL)
చారిత్రాత్మకంగా తెలంగాణ అంటే ఉనికిలో ఉన్నది వరంగల్ జిల్లానే. కాకతీయ తోరణం దగ్గరి నుండి కాకతీయ సామ్రాజ్యం వరకు అన్ని ఈ నగరం తన కడుపులో దాచుకుంది. కేంద్రం ప్రకటించిన స్మార్ట్ నగరాల జాబితాలో ఈ నగరం కూడా ఒకటి.

warangal

17. కొత్తగూడెం (KOTHAGUDEM)
భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెంలతొ కలిపి 18 మండలాలను కలిపి కొత్తగా కొత్తగూడెం జిల్లాగా ఏర్పాటు చేశారు.

kothagudem

18. మహబూబాబాద్ (MAHABUBABAD)
మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ ను 12 మండలాలతో కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు.

mahabubabad

19. రంగారెడ్డి (RANGAREDDY)
తెలంగాణలో అతి కీలకమైన జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా కూడా ఒకటి. పారిశ్రామికంగా, భౌగోళికంగా ఈ జిల్లా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. నిజాం కాలం తర్వాత రంగారెడ్డి జిల్లా ఉనికిలోకి వచ్చింది.

rangareddy

20. హైదరాబాద్ (HYDERABAD)
నాలుగు వందల ఏళ్ల నాటి చరిత్ర హైదరాబాద్ సొంతం.దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఐటి రంగంలో దేశంలోనే రెండో స్థానంలో హైదరాబాద్ దూసుకెళుతోంది. ప్రపంచంలోనే దిగ్గజాలుగా పేరున్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీలు ఎన్నో హైదరాబాద్ లో ఉన్నాయి.

hyderabad

21. శంషాబాద్ (SHAMSHABAD)
హైదరాబాద్ కు దగ్గరలోని గ్రామపంచాయితీ శంషాబాద్. ఎయిర్ పోర్ట్ నిర్మాణం, రింగ్ రోడ్డు ఏర్పాటు తర్వాత శంషాబాద్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందింది. శంషాబాద్ ను కొన్ని మండలాలతో కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు.

shamshabad

22. ఖమ్మం (KHAMMAM)
ఖమ్మం జిల్లాలో తెలంగాణలో ఎంతో అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా. ఎన్నో ప్రాజెక్టులు ఈ జిల్లాలో ఉన్నాయి.

khammam

23. సూర్యాపేట (SURYAPET)
తెలంగాణ ఏర్పాటు తర్వాత సూర్యాపేట, కోదాడ రెవెన్యు డివిజన్లను 20 మండలాలతో కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు.

suryapet

24. నల్గొండ (NALGONDA)
జైన మతానికి ఎంతో కీలకమైన ప్రాంతాలు నల్గొండ జిల్లాలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు ఎంతో కీలకమైన నాగార్జున సాగర్ ఈ జిల్లాలోనే ఉంది.

nalgonda

25. మహబూబ్ నగర్ (MAHABUBNAGAR)
ఇది తెలంగాణలో వలస జిల్లాగా పేరుగాంచింది. జిల్లాల విభజనకు ముందు వరకు తెలంగాణలో రెండో అతి పెద్ద జిల్లా మహబూబ్ నగర్.

mahabubnagar

26. నాగర్ కర్నూల్ (NAGARKURNOOL)
మహబూబ్ నగర్ జిల్లాలోని రెండో పార్లమెంట్ నియోజకవర్గంగా నాగర్ కర్నూల్ కు ముందు నుండి పేరుంది.

nagarkurnool

27. వనపర్తి (WANAPARTHY)
మహబూబ్ నగర్ జిల్లాలో భాగంగా ఉన్న వనపర్తి ఇప్పుడు కొత్తగా జిల్లాగా ఏర్పడుతోంది. రాజవంశం గతంలో వనపర్తి సంస్థానాన్ని పాలించిన చరిత్ర ఉంది.

wanaparthy

Related posts:
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
జీఎస్టీ బిల్ కథ..
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
ఉక్కిరిబిక్కిరి
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
పైసలు వసూల్ కాలేదుగా..
జయలలిత జీవిత విశేషాలు
జయ మరణం వెనక ఆ మాఫియా?

Comments

comments