బాబు గారి అతి తెలివి

Alla Ramakrishna gave clarity on Chandrababu Naidu wisdom

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలివి తేటల గురించి అందరికి తెలుసు. ఆయన తెలివిగా కొన్ని చేస్తే.. అతి తెలివిగా మరికొన్ని చేస్తారు. తను చేస్తున్న తప్పులను ఎంత బాగా కవర్ చేసుకోవచ్చో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అయితే చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్లు ఎక్కడా కనిపించకుండా బాగా కవర్ చేస్తుంటాడు. అయితే తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆయన చేసిన తప్పులను తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా సదావర్తి భూముల అంశంలో అయ్యవారు ఆడిన గేమ్ అందరికి షాకిస్తోంది. దీన్ని ఆళ్ల రామకృష్ణ తేల్చేశాడు. అసలు ఏం గేమ్ వేశారు..? ఆ గేమ్ ఎలా బయటపడింది అనే విషయాలను తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవండి.

సదావర్తి భూముల విషయంలో చంద్రబాబు నాయుడు సర్కార్ ఆడిన నాటకాలు చూస్తే అయ్యగారి అతి తెలివి ఎంతటిదో క్లీయర్ గా అర్థమవుతుంది. సదావర్తి భూముల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు సర్కార్ కొంత మందికి మేలు చెయ్యాలని ఉద్దేశ్యంతో తక్కువ ధరకు వేలం వేసినట్లు తేలింది. నిజానికి సదావర్తి భూముల విలువ రిజిస్ట్రార్ వారి ప్రాకరం ఎకరా ఏడు కోట్లు. దీనిపై చంద్రబాబు నాయుడుకు వారు లేఖ కూడా రాశారు. అయ్యా ఎకరం ధర ఏడు కోట్లు ఉంది కాబట్టి వేలంలో ఎక్కువ ధరకు అమ్మాలి అని రాశారు. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం వాటిని పట్టించుకోకుండా తమకు కావాల్సిన వాళ్లకు మార్కెట్ కంటే తక్కువ ధరకు వేలం వేయించింది.

అయితే జాగ్రత్తపడటంలో అందరికన్నా ముందుండే చంద్రబాబు నాయుడు ముందుగానే ఈ విషయంలో ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయిస్తారని అనుకున్నారు. అందుకే తమకు కావాల్సిన వాళ్లతో కోర్టులో ఎలాంటి ఆధారాలు లేకుండా పిటిషన్ లు వేయించడం.. వాటిని కోర్టు కొట్టివేయడం జరుగుతోంది. అయితే ప్రభుత్వం అంతా కరెక్ట్ గా చేస్తోంది అందుకే కోర్టు కూడా పిటిషన్ లు కొట్టివేసింది అని బిల్డప్ ఇచ్చుకునే భారీ గేమ్ ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు. అందుకే దీనిపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ క్లీయర్ గా తెలియజేశాడు. ఇప్పటికే ఓటుకు నోటు విషయంలో చంద్రబాబును ఎండగట్టిన ఆళ్ల రామకృష్ణ.. మరోసారి బాబుగారి అతి తెలివిని ఆధారాలతో సహా వెల్లడించారు.

 

Related posts:
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
కాటేసిందని పాముకు శిక్ష
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
అమ్మకు ఏమైంది?
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
బాబు బిత్తరపోవాల్సిందే..
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
అమ్మ పరిస్థితి ఏంటి?
అమ్మను పంపించేశారా?
ఏపికి యనమల షాకు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...

Comments

comments