ఆళ్లరామకృష్ణ నైతిక విజయం

Alla RamaKrishna Moral Sucess

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అండ్ కో ఫుల్ ఖుషీ ఉన్నారు. నిన్నటి దాకా స్టే వస్తుందా.? రాదా అన్న డైలమాలో ఉన్న చంద్రబాబు బ్యాచ్ కు హైకోర్టు ఊరటనిచ్చింది. ఏసీబీ కోర్టు కేసు విచారణకు ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను చంద్రబాబు నాయుడు తరఫు లాయరు క్వాష్ పిటిషన్ దాఖలు చెయ్యడం.. హైకోర్టు దీనిపై స్పందించిన ఎనిమిది వారాల పాటు ఈ కేసుపై స్టే విధించడం జరిగింది. అయితే ఇక్కడ న్యాయస్థానంలో చంద్రబాబు నాయుడు విజయం సాధించినా కానీ నైతికంగా మాత్రం ఆళ్ల రామకృష్ణ విజయం సాధించారని చెప్పుకోవచ్చు.

ఆళ్ల రామకృష్ణ వేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు అనుకూలంగా తీర్పునివ్వడం ఆయన మొదటి విజయం. దాంతో ఖంగుతిన్న చంద్రబాబు హుటాహుటిన క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఆయన పిటిషన్ లో మొదట ప్రస్థావించిన అంశం అసలు ఈ కేసుకు ఆళ్ల రామకృష్ణ అనే వ్యక్తికి ఎలాంటి సంబందం లేదు అని. ఓటుకు నోటు కేసు ఏడాదిగా కేసు విచారణలో ఉందని, ఆ కేసులో కనీసం సాక్షి కూడా కాని రామకృష్ణ దీనిపై ఎలా కేసు వేస్తారు అంటూ చంద్రబాబు లాయరు ప్రశ్నించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. చంద్రబాబు నాయుడు పేరును ఏసీబీ కోర్టు కానీ,  రామకృష్ణ కానీ తన పిటిషన్ లో పేర్కొనలేదు. మరి అలాంటప్పుడు చంద్రబాబు ఎందుకు అతి జాగ్రత్తగా వ్యవహరించారు అన్నది ప్రశ్న.

చంద్రబాబు నాయుడు న్యాయవ్యవస్థలోని పాయింట్ల ఆధారంగా టెక్నికల్ గా స్టే తెచ్చుకున్నా కానీ అది కేవలం ఎనిమిది వారాల వరకు మాత్రమే. ఎనిమది వారాల వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి ఉండదు కానీ తర్వాత మాత్రం ఏసీబీ ముందుకు సాగేందుకు అవకాశం లభించింది. పైగా హైకోర్టు ఆళ్ల రామకృష్ణను మీరు ఎలా కేసు వేస్తారు…? అని ప్రశ్నించలేదు. పైగా స్టే పై కౌంటర్ కూడా దాఖలు చేసుకోవచ్చని సూచించింది. దీంతో ఆళ్ల రామకృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తంగా చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి వర్గాల్లో చెమటలు పుట్టించిన ఆళ్ల రామకృష్ణ ఓ రకంగా విజేతనే. మరి ముందు ముందు చంద్రబాబుకు ఆళ్ల ఎలా చెక్ చెబుతారో చూడాలి.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
పవన్ మాస్టర్ స్కెచ్
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
బాబు Khan
మూడింటికి తేడా ఏంటి..?
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?
జయను ఎందుకు ఖననం చేశారంటే?

Comments

comments