బాబును వదిలేదిలేదు

Alla Ramakrishna Reddy said he wont leave Chandrababu Naidu

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు ఊరట లభించింది. చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేపట్టాలని ఏసీబీ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం శుక్రవారం ఆ ఉత్తర్వులను కొట్టివేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో చంద్రబాబుపై విచారణ అవసరం లేదన్న చంద్రబాబు తరపు న్యాయవాదితో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేవేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వినిపించిన వాదనలను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబుకు ఈ కేసులో ఊరట లభించింది.

Also Read:  బాబుకు యముడు… మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ

అయితే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడును వదిలిపెట్టే ప్రసక్తేలేదని తేల్చేశారు. ఇప్పటికే తన కోర్టు కేసులతో చంద్రబాబు నాయుడు అండ్ కోకు చమటలు పట్టించిన ఆర్కే(ఆళ్ల రామకృష్ణారెడ్డి) తాజాగా చేసిన ప్రకటనతో అధికారపక్షంలోని కొంత మంది గుసగుసలాడుకుంటున్నారట. ఈ కేసు నుండి బయటపడడానికే చంద్రబాబు నాయుడు చాలా ప్రయాసపడాల్సి వచ్చిందని, మరి సుప్రీంకోర్టుకెక్కనున్న ఆర్కే వల్ల మరిన్ని కష్టాలుపడాల్సి వస్తుందని అనుకుంటున్నారట. అందుకే చంద్రబాబు నాయుడును వదలని ఆర్కేను కొంత మంది పట్టువదలని విక్రమార్కుడితో పోలుస్తున్నారు. మరి ఆర్కే విక్రమార్కుడు అయితే భేతాళుడు ఎవరో చెప్పనక్కర్లేదనుకుంటా?!

Related posts:
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
ఆరిపోయే దీపంలా టిడిపి?
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
జగన్ అన్న.. సొంత అన్న
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
గెలిచి ఓడిన రోహిత్ వేముల
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
బుల్లెట్ బాబా...అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్

Comments

comments