తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్

Allu Arjun supports Telangana Govt for that

అవును.. మీరు చదువుతున్నది అక్షరాల సత్యం. అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జై కొట్టారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి ఆయన మద్దతుపలికారు. ఇంతకీ ఆయన ఏ విషయంలో తెలంగాణ సర్కార్ కు మద్దతు పలికారో తెలిస్తే షాక్ తింటారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమం పైన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. హరిత హారంలో భాగంగా అల్లు అర్జున్ కుటుంబం వారు కొన్న సైట్ లో మొక్కలు నాటారు. తన తనయుడితో తొలుత మొక్క నాటించానని ఆయన చెప్పారు. వాళ్ల జనరేషన్ కు కూడా ఇవి ఉపయోగపడతాయని, అందుకే తన కొడుకుతో మొదట నాటించానని చెప్పారు. ఓ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం మంచిదన్నారు.

ఓ పాఠశాలనో, కొందరో చేపడితే, అక్కడికే పరిమితమవుతుంటుందని, కానీ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని చేపడితే అందరికీ చేరుతుందని అభిప్రాయపడ్డారు. తన మామయ్య టీఆర్ఎస్ లో యాక్టివ్ మెంబర్ అని, మొక్కలు నాటితే బాగుంటుందని ఆయన చెప్పారని పేర్కొన్నారు. హరిత హారం ద్వారా ప్రభుత్వం మంచి పని చేసిందని, తన వ్యాఖ్యల్లో రాజకీయ కోణం లేదని చెప్పారు. ప్లాంటేషన్ అందరికీ సంబంధించిన విషయమని, పార్టీలకు సంబంధించినది కాదన్నారు. ఒకరోజున 25 లక్షల మొక్కలు నాటివ్వడం బాగుందని అభిప్రాయపడ్డారు. మొక్కలు నాటే అంశం తన కొడుకు జనరేషన్ కు చాలా ముఖ్యమన్నారు. మనం ఏ పనులు చేస్తే అవే పనులు మన పిల్లలు చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి హరిత హారంలో మద్దతిస్తున్నానని చెప్పారు. తనకు రెండు అంశాలంటే ఇష్టమని, ఒకటి మొక్కలు నాటడం, రెండు పిల్లలందరూ చదువుకోవాలనే అంశమన్నారు.

Related posts:
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
బావర్చి హోటల్ సీజ్
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
సన్మానం చేయించుకున్న వెంకయ్య
ముద్రగడ సవాల్
వాళ్లను వదిలేదిలేదు
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
తాట తీసిన క్రికెటర్ గౌతం గంభీర్
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
బిచ్చగాళ్లు కావలెను
మోదీ ఒక్కడే తెలివైనోడా?

Comments

comments