బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది

Amaravathi Building dwindled partially

అవును.. అక్కడెక్కడో బిల్డింగ్ కుంగితే దానికి చంద్రబాబు నాయుడు ఎడమకన్ను అదిరడం ఏంటీ అనుకుంటున్నారా..? ఏదో బిల్డింగ్ అయితే ఎవరూ దాన్ని పట్టించుకోరు.. కానీ అది అమరావతిలో తాజాగా నిర్మిస్తున్న సచివాలయం బిల్డింగ్. అమరావతి నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న సచివాయ నిర్మాణం వేగంగా సాగుతున్న విషయం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. చంద్రబాబు నాయుడు అధికారుల వెంటపడి మరీ పనులను స్పీడప్ చేస్తున్నారు అని అన్నింటోనూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజా చంద్రబాబు నాయుడు అండ్ అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికి షాక్ తగిలింది.

చంద్రబాబు నాయుడుకు ఎడమకన్ను అదరడం అంటే ఏదో అనుకున్నారేమో.. ఇదే. జూన్ 27లోగా ఏపి ఉద్యోగులు వెలగపూడి చేరుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన బాబు ఈ పరిణామంతో ఖంగుతిన్నారు. ఎందుకంటే ముందు నుండి అమరావతి విషయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడుతున్నారు . కానీ ఏకంగా బిల్డింగ్ కుంగిన వార్త అందరికి షాకిచ్చింది. సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కొంతమేర నేల కుంగిపోయింది. మూడు అడుగులు వరకు నేల కుంగడంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది. దీంతో అక్కడి పనిచేస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. లూజ్ సాయిల్ వల్లే నేల కుంగివుండొచ్చని అనుమానిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో నేల కుంగిపోవడంతో పనులు ఏవిధంగా సాగించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. మంత్రులకు, ప్రిన్సిపాల్ కార్యదర్శలకు కేటాయించనున్న బ్లాకులో నిర్మాణ లోపాలు బయట పడడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

దీనిపై అప్పుడే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అమరావతి కోసం ఎంపిక చేసిన భూమి నిర్మాణాలకు అంతగా అనుకూలం కాదు అని హెచ్చరించినా కానీ వినలేదనే వాదన ఉంది. నదీపరివాహక ప్రాంతం కావడంతో భూమి కుంగే అవకాశాలు ఉండవచ్చు అని అనుకున్నా కూడా దానికి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని వాదన కూడా ఉంది. అలాగే ముందు నుండి అనుకున్నట్లు అమరావతికి పెట్టిన ముహూర్తం మంచిది కాదు అనే దానికి మరోసారి బలం చేకూరింది.

ఉద్దండరాయునిపాలెంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాగశాల కుప్పకూలింది.ఆ మండపం వద్ద ఏర్పాటు చేసి అఖండ జ్యోతి రెండు నెలలకే ఆరిపోయింది.  ఇక అమరావతి కోసం అంటూ ప్రతి గ్రామం నుండి సేకరించిన మట్టి కూడా వర్షానికి కొట్టుకుపోయింది. ఇలా అన్నీ అరిష్టాలు జరుగుతున్నాయని.. కాబట్టి దీనికి దోషనివారణ చెయ్యాలని కొంత మంది వాదిస్తున్నారు. మొత్తానికి అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక రాజధాని నిర్మాణ పనుల్లో ఇలా జరగడం ఉద్యోగులకు కాస్త భయపెడుతోంది. మరి దీని మీద చంద్రబాబు సర్కార్ ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.

Related posts:
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
గులాబీవనంలో కమలం?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
తెలుగుదేశంలో ఆగష్టు భయం
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ఏపి సిఎంగా నారా లోకేష్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments