ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే

Ambati Rambabu Comments On Chandrababu naidu Tuni Incident And Vote for Note Issues

విషయం ఏమిటంటే.. వరుసగా రెండో రోజు (07-09-2016) 7 గంటలకుపైగా సీఐడీ విచారణ సాగించింది. మొత్తంగా 13 గంటలకుపైగా భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడీ విచారించడం జరిగింది. ఈ తరుణంలో భూమని ఏ సమయంలోనైనా అరెస్ట్ చేయవచ్చునన్న పరిస్థితి ఏర్పడింది. దీనిలో భూమన కరుణాకర్ రెడ్డిని ఇరికించడం శోచనీయం అని మద్దతుదారులు, వైకాపా నేతలు చెబుతున్నారు.

భూమన అనుచరులు మాట్లాడుతూ.. భూమన సంఘటన జరిగిన ప్రాంతంలో లేరని, తుని సంఘటనకు, ఆయనకు ఎటువంటి సంబంధం లేదని, ఆయన నిజాయితీ గల వ్యక్తి అని, సంఘటన గడిచిన 8 నెలల తరువాత విచారించడం శోచనీయం అని, పైగా నిన్న 6 గంటలు విచారణ జరిపి ఇప్పుడు మళ్ళీ 7 గంటలకుపైగా విచారణ చేయడం ఏమిటని వారి బాధను వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. తరువాత మీడియాతో వైకాపా నేత అంబటి రాయుడు మాట్లాడుతూ ‘ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే’నని ఆవేదన వ్యక్తపరిచారు. అసలు ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోమన్నారు. తుని సంఘటన జరుగుతున్నప్పుడు చంద్రబాబు మీడియా ముందుకొచ్చి ‘ఇది వైకాపా చేయించిన దుర్ఘటన‘ అని ఆరోపించారు. అసలు విచారణ జరపకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు అలా ఎలా మాట్లాడగలిగారు అని ప్రశ్నించారు. తను చెప్పిన విషయం నిజమేనని ప్రజలకు నమ్మించడానికి ఇప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ కూడా ఆయన వ్యాఖ్యలకి అద్దం పడుతున్నాయన్నారు.

ఓటుకునోటు కేసులో తను ఇరుక్కున్నందున, ప్రత్యేక హోదాపై ఎటూ తేల్చని పరిస్థితుల్లో ఇలా రాజకీయాలు చేసి ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారని అన్నారు. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలలో వేసే ప్రశ్నలను ఎదుర్కొవలసి వస్తుందని, అందుకే ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు అంబటి రాంబాబు. అంతేకాకుండా ఇంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుని ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.

Related posts:
అమావాస్య చంద్రుడు
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
అమిత్ షా రేస్ లో... తుస్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
నయిం కేసులో పెద్ద తలకాయలు
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
బాబు ఏమన్నా గాంధీనా?
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments