గులాబీవనంలో కమలం?

Amith Shah plans to Bring Telangana BJP into Power instead of TRS

తెలంగాణ గులాబీవనంలో కమలాలను పూయించడానికి బి.జె.పి అధినాయకత్వం మంచి ఊపుమీదుంది, అమిత్ షా ముందు నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎలాగూనా కమల వికాసానికి ప్రయత్నాలు చెయ్యాలని డిసైడ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారానికి దగ్గరకి చేరే అవకాశాలు మెండుగా ఉన్నా కానీ ఒక్కసారి కూడా బిజెపి అధికారంలోకి రాలేదు. మరి అలాంటిది అమిత్ షా దీన్ని గమనించి వెంటనే తెలుగు రాష్ట్రాల్లో అందులో ముఖ్యంగా తెలంగాణలో బిజెపిని అధికార పీఠం దగ్గరికి చేర్చాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దీనికి రాజకీయంగా ఇంకో కారణం కూడా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో అధికారంలో టిఆర్ఎస్ ఉంది. ఏపిలో టిడిపి ఉంది. టిడిపి ముందు నుండి కూడా బిజెపి మిత్రపక్షంగా ఉంది. ఒకవేళ అలా కాకుండా జగన్ అధికారంలోకి వచ్చినా కూడా అతడి మీద కేసులున్నాయి కాబట్టే ఎలాగైనా తమకే మద్దతు తెలుపుతాడు అన్నది అమిత్ షా స్కెచ్. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. అధికార టిఆర్ఎస్ పార్టీ బిజెపితో చేరడానికి ముందు నుండి సుముఖంగా లేదు. పైగా రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని ఎదురించి నిలిచే పార్టీ ప్రస్తుతానికి ఏదీ లేదు. దాంతో ఎలాగైనా తమ పార్టీనఅధికారంలోకి తీసుకురావాలన్నది అమిత్ షా ప్లాన్ వేశారు. అందులో భాగంగా తెలంగాణలో టి.ఆర్.ఎస్ అధికారాన్ని ఎలా అయినా వచ్చే ఎన్నికల్లో పడకొట్టాలని, తెలంగాణలో 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు పిలుపునిచ్చారని సమాచారం.

Related posts:
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
తెలుగుదేశంలో ఆగష్టు భయం
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
ఏపిలో జగన్ Vs పవన్
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
బాబుగారి చిరు ప్లాన్
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
మన ఖాతాలే మోదీ టార్గెట్?

Comments

comments