పవనం అయినా హరికేన్ అయినా తలవంచాల్సిందే

pawan-political-analysis

పవన్ కళ్యాణ్ అడుగులపై శ్రీచక్ర మల్లికార్జున విశ్లేషణ మీకోసం.. దీనికి ప్రేరణ సామాజిక మాధ్యమంలో జగన్ డిజిటల్ సేన అనే గ్రూపులో కొందరి మద్య జరిగిన సంభాషణ ముఖ్యకారణం.

**మంచి**
రాష్ట్రం కొత్తది. అనుభవం ఉన్నవ్యక్తి అయితే రాష్ట్రాన్ని అభివృద్ది పరచగలడు కచ్చితంగా అని భావించిన వ్యక్తుల్లొ పవన్ ఒకడు. రాష్ట్రాన్ని కాంగ్రెస్స్ అడ్డగోలుగా విభజించేసరికి వేదనకు గురై, కుమిలి పోయిన వ్యక్తుల్లొ పవన్ ఒకడు. ఆ తరుణంలో దేశం మొత్తం కాంగ్రెస్ అంతులేని అవినీతికి విసిగిపోయి మోడి వైపు చూసిన పరిస్తితి. ఇంత వరకు చదివిన వారికి పవన్ తీసుకున్న నీర్ణయం మంచిదే అనిపిస్తుంది. అనిపించింది. కూటమి గెలుపుకు కారణం అయింది.

**చెడు**
రైతుకు రుణ మాఫీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విద్య పూర్తిచేసిన వారికి ఉద్యోగం లేదా నిరుద్యొగ భృతి అని.. ఇంకా లెక్క లెనన్ని హామీలను గుప్పించి అధికారమే పరమవధిగా కుట్ర చేసారు.
కొన్ని ప్రత్యేకమైన పరిస్తుతులలో రాజకీయం గురించి పూర్తిగా అవగాహన లేని పవన్ ను సప్పోర్టు తీసుకుని కాపులకు రిజర్వషన్లు కలిపిస్తామని హామి ఇచ్చి కాపు సామాజిక వర్గం ఓట్లను చీల్చి, అధికారంలోకి తెలివిగా తెలుగు దేశం ప్రభుత్వం వచ్చింది.
ఇచ్చిన హామీలు అన్ని అబద్దాలే అని నీరూపించుకోవడమే కాకుండా అంతులేని అవినీతి, అరాచక, నిరంకుశ పాలనకు చంద్రబాబు కొత్త రాష్త్రములో తెర లేపారు. ప్రశ్నిస్తానికే తన పార్టి అన్న విషయం మరిచిపోయి, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అన్న రీతిలో.. చంద్రబాబు చేడు పాలను చూడకుండా, అరచక పాలనకు గురి అయినా అమాయకపు ప్రజల గోడు వినకుండా, చంద్రబాబు అవినీతి పై మాట్లాడకుండా ఒక మూడు సంవత్సరాలు వెళ్ళబుచ్చాడు పవన్ కళ్యాణ్.

**నాటకం**
చంద్రబాబు ఎటువంటి పునాదులపైన వున్నాడు తెలియనప్పుడు.. అతనికి మద్దతు పలకడంలో అర్థం వుంది. అతని దుర్మాగపు పాలన తెలిసి కూడా ముసుగు వేసుకొని ప్రజల తరుపున పోరాడుతా అని నటిస్తూ తెలుగుదేశం కోసం చంద్ర బాబు చేతిలొ కీలు బొమ్మ అవటం అనేది.. పవన్ యొక్క రాజకీయ సిద్దాంతం ఏమిటో అర్థమవుతున్నది.
జరగబోయెది

పవన్ కళ్యాణ్ ముసుగుతీసి పూర్తిగా చంద్రముఖం వైపు మారే తరుణంలో.. కొన్ని వింత పోకడలు గమనిస్తాము. తె.దా.పా పై ప్రజా వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది అంటే ఒకలాగా.. తగ్గుతుంది అంటే ఒకలాగా మారే అవకాశం వుంది. ఏది ఏమైనా .. పవన్ జెండా వేరైనా, అజండా మాత్రం తెలుగుదేశందే. అత్యధిక ఓటు శాతం ఉన్న కాపు సామజికవర్గం కారణంగానే పవన్ కు రాజకీయ విలువ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు జరిగిన.. జరుగుతున్న.. ఉన్న పరిస్తితులదృష్ట్య మోసం ఏ రూపంలో వచ్చినా అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా వున్నారు.

చివరి మాట
కావునా అతనిని రాజకీయంగా విమర్శించడంలో ఎంత మాత్రం తప్పులేదు. అతనిని విమర్సిస్తే ఓట్లు రావనిగాని.. పోతాయి అనిగాని అనుకుంటె పొరబాటే. మనం ప్రజలను నిత్యం వాస్తవాలతో చైతన్యవంతులను చేయాలి.
మాట ఇచ్చాడు అంటే నిలమెట్టుకునేవాడు ఒక్కడే. పవనం అయినా హరికేన్ అయినా తలవంచాల్సిందే!! – శ్రీచక్ర మల్లికార్జున

pawan-political-analysis-1

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
పవన్ ను కదిలించిన వినోద్
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
మూడింటికి తేడా ఏంటి..?
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
మోదీ భజన అందుకేనా?
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ
రాహుల్ పై కరుణ ఆగ్రహం

Comments

comments