తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది

Andhrajyothi telecost a story with lies

ఎవరు చెయ్యాల్సిన పని వాళ్లు చేస్తే దేశంలో ఎక్కడా.. ఎలాంటి సమస్యా ఉండదు అని ఫ్రిడల్ క్యాస్ట్రో మాట. కానీ మన దగ్గర మాత్రం అలా కాకుండా అసలుకు ఎసరు పెట్టి.. కొసరును మాత్రం కొండంత చేసి చూపిస్తుంటారు. ముఖ్యంగా తెలుగు మీడియాలో అయితే ఎల్లో జర్నలిజం బాగా పెరిగిపోయింది. మీడియా అంటే నిస్పక్షపాతంగా వార్తలు అందించాల్సింది పోయి.. సొంత అభిప్రాయాలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగునాట ముందు నుండి ఎల్లో జర్నలిజం ఉనికిలో ఉన్నా కానీ తాజాగా మాత్రం మరింత పెచ్చుమీరింది.

జర్నలిజం చెయ్యాల్సిన మీడియా ఛానల్స్ రాజకీయాలు చేస్తున్నాయి అనడానికి ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనమే ప్రత్యక్షసాక్షం. ఏపి బిజెపి నాయకులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన తర్వాత మొదటిసారి దిల్లీకి వెళ్లారు. అక్కడ బిజెపి కీలక నేతలను, కేంద్ర మంత్రులను కలిశారు. ఏపిలో పార్టీ పరిస్థితి, తెలుగుదేశం వైఖరి మీద చర్చించారు. ప్రత్యేక ప్యాకేజీ మీద బిజెపి పార్టీకి అనుకున్న స్థాయిలో క్రెడిట్ లభించలేదు అని బిజెపి వర్గాలు అమిత్ షాతో అన్నట్లు తెలుస్తోంది. దీని మీద ఎబీఎన్ లో ఓ కథనం ప్రసారమైంది.

ఎబీఎన్ కథనం ప్రకారం.. ఏపి బిజెపి నాయకులు టిడిపి మీద మండిపడ్డారని.. కానీ అమిత్ షా మాత్రం తెలుగుదేశంతో తమ పొత్తుసాగుతుందని, ప్యాకేజీ గురించి ప్రజల్లోకి అవసరమైతే తెలుగుదేశంతో కలిసి ప్రచారం చెయ్యాలని సూచించారని కథనం ప్రసారం చేసింది. కాగా చివర్లో మాత్రం కాంగ్రెస్ తో కానీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కానీ పొత్తు ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదు అని, అవినీతి మకిలి అంటున్న వారితో పొత్తు ఎప్పటికి కుదరదు అని అమిత్ షా అన్నట్లు ప్రసారం చేసింది.

ఇక్కడ గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అమిత్ షా, నరేంద్ర మోదీలు తలపండిన రాజకీయ నాయకులు. అధికారం కోసం ఎన్ని పాచికలైనా పారించే రకం. అమిత్ షా, మోదీల ఆదేశాలతో బద్దశత్రువు కాంగ్రెస్ తో కలిసి పోటీచేసిన సందర్భాలున్నాయి. అమిత్ షాకు గానీ, మోదీకి గానీ తమ పార్టీ, అధికారమే పరమావధి. మరి అలాంటి పరిస్థితుల్లో ఏపిలో మాత్రం జగన్ తో, కాంగ్రెస్ తో పొత్తు ఎప్పటికి ఉండదు అని అనడం హాస్యాస్పదం. మరి అదే ఆంధ్రజ్యోతికి అవినీతిలో ఏపిని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపిన చంద్రబాబు గురించి మాత్రం తెలియదా..? దాన్ని వదిలేసి చంద్రబాబుకు వంతపాడటం ఆంధ్రజ్యోతికి ఎంత వరకు కరెక్ట్?

ఏపిలో కాంగ్రెస్ ఎప్పుడో సమాధైంది. ఇక మిగిలిన వైసీపీకి రోజురోజుకు బలం పెరుగుతోంది. ఓ పక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న తప్పులు, జగన్ కు పెరుగుతున్న ఆదరణలతో రాజకీయాలు మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కొంత ఓటు శాతం తేడాతో జగన్ పార్టీ అధికారానికి దూరమైంది. అలాంటి టైంలో జగన్ అధికారపీఠానికి చేరువైతే మాత్రం అమిత్ షానే ముందుండి బిజెపి-వైసీపీ పొత్తు గురించి మాట్లాడటం ఖాయం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఏపిలో నమ్మకం తగ్గింది.. అలాంటి టైంలో అమిత్ షా లాంటి రాజకీయ మేధావి మునిగిపోయే బోటు ఎట్టి పరిస్థితిలో ప్రయాణాన్ని కోరుకోడు.. ఖచ్చితంగా గెలుపు గుర్రాల మీదనే ప్రయాణిస్తాడు.

మరి 2019నాటికి తెలుగుదేశం పరిస్థితి మరింత దిగజారితే బి.జె.పి ఖచ్చితంగా వైసీపీతో కలిసి ప్రయాణించాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. జగన్ మాటలు, వైసీపీ వైఖరి మొత్తం చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడేలా ఉన్నాయే తప్ప కేంద్రంలోని ఏ ఒక్కరిని టార్గెట్ గా చెయ్యలేదు. ఇప్పటికే ఏపిలో బిజెపికి తెలుగుదేశం అడ్డుగా నిలుస్తోందని అపవాదు ఎలాగూ ఉంది. మరి ఇన్ని అవకాశాలున్న టైంలో ఎబీఎన్ మాత్రం ప్యాకేజీ గురించి మాట్లాడి.. తిరిగి తిరిగి వైసీపీ, జగన్ తో బిజెపి పొత్తు ఎన్నటికి సాధ్యంకాదు అని కథనం ప్రసారం చెయ్యడం ఎవరికి లాభం చేకూర్చడానికో.

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
సింధూరంలో రాజకీయం
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
పవన్ ను కదిలించిన వినోద్
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
అన్నదమ్ముల సవాల్
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
తొక్కితే తాటతీస్తారు
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
రాహుల్ పై కరుణ ఆగ్రహం

Comments

comments