ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?

Anil Kumble Indian Cricket Team Head Coach

ఇన్నాళ్ళూ టీమిండియా కోచ్ పదవి ఎవరికి వరిస్తుందా? అనే సస్పెన్స్‌ వీడింది. ఈ కోచ్ పదవికి మొత్తం 57 మంది దరఖాస్తు చేసుకోగా.. టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఎంపికయ్యాడు. ఈ మేరకు బిసిసిఐ ఆయన్ను కోచ్‌గా నియమిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దీంతో భారత క్రికెట్ జట్టు 11వ కోచ్‌గా కుంబ్లే త్వరలో బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఈ ప్రధాన కోచ్ ఎంపిక ప్రక్రియలో భాగంగా వచ్చిన 57 దరఖాస్తుల నుండి మొత్తం 20 మందిని సెలక్ట్ చేసి, వారి నుండి హెడ్ కోచ్‌ను ఎంపిక చేయాలని సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన త్రిసభ్య కమిటీకి బీసీసీఐ సూచించింది. బోర్డు సూచన మేరకు ఈ బృందం ఆ 20 మందిని ఇంటర్వ్యూ చేసిన అనంతరం నివేదికను బిసిసిఐకి అందించింది. ఈ నివేదిక ఆధారంగా  కుంబ్లేను ప్రధాన కోచ్‌గా ఏడాదిపాటు నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ పదవికి అనిల్ కుంబ్లేతోపాటు ప్రవీణ్ ఆమ్రే, లాల్‌చంద్ రాజ్‌పుత్, రవిశాస్త్రి, టామ్ మూడీ, స్టువర్ట్ లా, ఆండీ మోల్స్, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాద్ తదితరులు పోటీ పడ్డారు. వీరిలో రవిశాస్త్రి నుంచి తీవ్ర పోటీ ఎదురైనా చివరికి కుంబ్లేనే ప్రధాన కోచ్ పదవి వరించింది.

ఇదిలావుండగా.. 1990లో టెస్టు, వన్డే కెరీర్‌ను ఒకేసారి ఆరంభించిన కుంబ్లే.. అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించాడు. ప్రపంచ క్రికెట్లో అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన మూడో బౌలర్గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 132 టెస్టులకు ప్రాతినిథ్యం వహించిన కుంబ్లే 619 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు.. 271 వన్డేలు ఆడిన కుంబ్లే 337 వికెట్లను తీసి భారత్‌కు అనేక విజయాలు అందించాడు.

Related posts:
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
సిరీస్ టీమిండియా సొంతం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments