ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో

Any Time Medicines like ATM

మీరు చదువుతున్నది కరెక్టే. ఏటిఎంలో ఎలాగైతే ఎప్పుడు డబ్బులు లభిస్తాయో అదే తరహాలో మందులు లభించేలా ఓ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది ఏపి సర్కార్. మారుమూల ప్రాంతాల్లోని ఏజెన్సీలలో 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండేలా సరికొత్త మార్పులు తీసుకువస్తుంది. ఏటీఎం మిషన్‌ మారిది.. మందులు ఉండే మెషిన్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పటికే ఏటీఎం మిషన్స్‌ ప్రాథమికంగా పరీక్షించారు. త్వరలోనే ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

విజయనగరం జిల్లా అంటే చాలు గుర్తుకు వచ్చేది మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు. ఈ ఏజెన్సీలోని ప్రజలకు నేటికి వైద్యం అందటం లేదు. సకాలంలో సరైన వైద్యం అందక చాలామంది ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఆ పరిస్థితులను రూపుమాపేందుకు ఏపీ వైద్యఆరోగ్యశాఖ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో 24 గంటలు వైద్యం, మందులు అందేలా మెడికల్ ఏటీఎం మిషన్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. పైలెట్ ప్రాజెక్టుగా గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డకళ్లు, కురుపాం మండలం నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ఏటీఎం మిషన్లను ఏర్పాటు చేయనున్నారు.

మల్టీ పేషెంట్ మానిటరింగ్ మెషీన్ ఆధారంగా మందుల ఏటీఎం పనిచేస్తుంది. ఈ మెషిన్ సిమ్‌ను ఆధారంగా చేసుకుని పనిచేస్తోంది. మల్టీ పేషెంట్ మానిటరింగ్ మెషీన్ ద్వారా పేషంట్‌‌ను పరీక్షించి, అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా రోగి జబ్బుల లక్షణాలు డాక్టర్‌కి చేరుతుంది. పేషంట్‌కు అవసరమైన మందులను, వాటి కోడ్‌లను డాక్టర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కోడ్‌లను తెలిపిన తర్వాత ఫార్మసిస్ట్‌ లేదా స్టాఫ్‌నర్స్ ఏటీఎం పిన్‌ను ప్రెస్ చేసి ఆ తర్వాత మందులకు సంబంధించి కోడ్‌ను ఎంటర్‌ చేస్తారు. అప్పుడు పేషెంట్‌కు కావాల్సిన టాబ్లెట్స్ వస్తాయి.

ఒక్కసారి మెడిసిన్‌ ఏటీఎమ్‌ వినియోగించుకున్న పేషెంట్‌‌కు సంబంధించి ప్రతీ డేటా ఈ డ్రగ్ వెండింగ్ మిషన్లో ఫీడ్ అయి ఉంటుంది. ఇటీవలే జిల్లాకు వచ్చిన మెడికల్‌ ఏటిఎంల పనితీరు, ఆన్‌లైన్‌ విధానం కోడ్ రూపాకల్పన ప్రాథమిక దశలో ఉంది. నిపుణుల బృందం పర్యవేక్షణ తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో అందుబాటులోకి ఉంచనున్నారు.

Related posts:
అతడికి గూగుల్ అంటే కోపం
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
సౌదీలో యువరాజుకు ఉరి
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
2018లో తెలుగుదేశం ఖాళీ!
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
గుదిబండగా మారిన కోదండరాం
మంత్రి గంటా ఆస్తుల జప్తు

Comments

comments