రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?

AP Administration under control after two and half year

ఏపిలో పాలన సరిగా లేదు. విభజన తర్వాత ఏపిలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడానికి, పరిపాలన గాడిలో లేకపోవడానికి కారణం ముందు నుండి కూడా ఉద్యోగులు అందుబాటులో లేకపోవడం. అయితే వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి మోక్షం లభించింది. అక్కడికి ఉద్యోగులు తరలి వెళ్లిపోయారు. దాదాపు నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా ప్ర‌జ‌ల‌కు సేవలందించిన హైద‌రాబాద్‌లోని ఏపీ స‌చివాల‌య భ‌వ‌నం ఇప్పుడు నిశ్శ‌బ్దంతో బావురుమంటోంది.  దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత రెండు సెక్రటరేరియట్ ల ఉద్యోగులు విడిపోయి తమ  రాష్ట్ర సచివాలయంలో పని చెయ్యడానికి సిద్ధమయ్యారు. అయితే సచివాలయం అందుబాటులో లేకపోవడంతో అభివృద్ధి మందగించింది అని చాలా సార్లు చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నాడు. కాగా విభజన తర్వాత చెట్ల కింద అయినా కూడా తాము పని చెయ్యడానికి సిద్ధం అని నాడు సెక్రటేరియట్ ఉద్యోగులు ప్రకటించారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

ఏపిలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నుండి ఇప్పటి దాకా అంటే దాదాపుగా రెండున్నరేళ్ల పాటు ప్రభుత్వం అరకొరగా పనిచేస్తోంది. చంద్రబాబు నాయుడు పనీతీరు కూడా ఉద్యోగులు లేకపోవడంతో సరిగాలేదు అనేది వాదన. కాగా తాజాగా వెలగపూడిలో ఉద్యోగులు ఏపి సచివాయ విధుల్లో పూర్తి స్థాయిలో చేరుతున్నారు. దాంతో ఇప్పటిదాకా రెండున్నరేళ్లపాటు సాగిన అలసత్వానికి ఇప్పుడు ఎండ్ కార్డ్ పడింది అని అందరూ అనుకుంటున్నారు. కాగా ఇక్కడ మరో కోణం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు వల్లే సచివాలయ ఉద్యోగులు ఏపికి తరలడానికి సంకోచించారు అనే దానిలో కూడా వాస్తవం ఉంది.

ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ తో ముడిపడిన చాలా మంది ఏపి సెక్రటేరియట్ ఉద్యోగులు ఉన్నపళంగా హైదరాబాద్ విడవాలి అంటే భయపడ్డారు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అక్కడ పిల్లల చదువులకు ఎలాంటి అడ్డులు వస్తాయో తెలియదు. దీన్ని ఆధారంగా చాలా విమర్శలు కూడా వినిపించాయి. కొత్తగా పార్టీలో చేరే వారికి చంద్రబాబు నాయుడు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తారు మరి ఎంతో కీలకమైన ఏపి సెక్రటేరియట్ ఉద్యోగులు వెలగపూడి రావడానికి మాత్రం ఎలాంటి వెసలుబాటు కల్పించలేదు. మొత్తంగా కనీసం రెండున్నరేళ్ల తర్వాత అయిన ఏపిలో పాలన గాడిలో పడేందుకు ఏపి సెక్రటేరియట్ ఉద్యోగుల రూపంలో అవకాశం వచ్చింది. మరి రానున్న రెండున్నరేళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
పైసలు వసూల్ కాలేదుగా..
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్

Comments

comments