హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి

AP and Telangana States getting funds on Hindi Language

మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అన్నట్లు.. మీకు హిందీ వచ్చా.. వస్తే మీ రాష్ట్రానికి నిధులు వస్తాయి లేదంటే మీ రాష్ట్రానికి రూపాయి కూడా రాదు అనే వార్త సంచలనం రేపుతోంది. ఇది ఎవరి గురించో అయితే మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల గురించే ఈ వార్త. కేంద్రం దగ్గరి నుండి నిధులు రాబట్టడానికి ఇటు తెలంగాణ, అటు ఏపి ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో నిజాం పాలన ఉండేది కాబట్టి చాలా మందికి హిందీ వచ్చు. ఇప్పుడు ఆ హిందీనే కేంద్రం వద్ద తెలంగాణ రాష్ట్రానికి బలంగా మారిందట. కానీ ఏపిలో మాత్రం చాలా మందికి హిందీ రాదు.. కనుక వాళ్లకు నిధులు రావడం లేదని వార్త హల్ చల్ చేస్తోంది.

చూసిరమ్మంటే చూసి వచ్చే రకం మన తెలుగు వాళ్లు. కానీ దిల్లీలో మాత్రం మన వాళ్ల పప్పులుడకడం లేదు. కాకపోతే ఏపి నాయకుల కంటే ముందు తెలంగాణ నాయకులు.అక్కడి వ్యవహారాలను చక్కబెట్టడానికి హిందీలో మాట్లాడి.. స్పీడ్ గా ఫైళ్లను కదిలిస్తున్నారట. కానీ ఏపి నాయకులు మాత్రం తాము చెప్పాలనుకున్న మ్యాటర్ ను చెప్పడానికి తల ప్రాణం తోకకొస్తోందట. ఆంధ్రప్రదేశ్‌ నేతలు ఢిల్లీలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారట. ఈ విషయాన్ని ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలే చెబుతున్నారు. ఢిల్లీలో తమకు మహా చిక్కొచ్చి పడిందంటున్నారు వారు. చంద్రబాబు కేబినెట్ మంత్రులు, టీడీపీ ఎంపీలలో చాలా మందికి హిందీ రాదు. వచ్చిన వారికి అరకొరనే. ఢిల్లీలో తమ రాష్ట్రానికి రావాల్సిన అంశాల పై అక్కడ అధికారులకు సరైన ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నారట వారు.

ఇక తెలంగాణకు చెందిన వాళ్లు మాత్రం హిందీలో ఇరగదీసి.. స్వామి కార్యం పూర్తి చేస్తున్నారట. రాష్ట్రం ఏర్పడి రెండేళ్లయినా ఇంత వరకు లోటు తీర్చ లేదని చెబుతున్నారు. చంద్రబాబు ఇరవై సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా తిప్పి కొడితే మూడు వేల కోట్లకు మించి రాలేదని గుర్తు చేస్తున్నారు. కానీ తెలంగాణ విషయానికి వస్తే… ఆ మధ్య నీతి అయోగ్ సభ్యులు తెలంగాణలో పర్యటించినప్పుడు మిషన్ కాకతీయ పథకాన్ని పరిశీలించారు. దీని కోసం మూడు వేల కోట్లు ఇవ్వాల్సిందిగా నీతి అయోగ్ ను తెలంగాణ సర్కారు కోరిందట. అడిగిందే తడవుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా కేంద్రానికి నీతి అయోగ్ రికమండ్ చేసిందట. వెనకబడిన జిల్లాల కోసం మరో నాలుగు వందల కోట్లు ఇచ్చారట. మరో నాలుగు వందల కోట్లు ఇవ్వాల్సిందిగా తెలంగాణ సర్కారు కోరిందట. దానికి సానుకూలంగా స్పందించినట్టు చెబుతున్నారు. మొత్తానికి ల్యాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఏపికి నిధుల విషయంలో తీరని లోటు కనిపిస్తోందని.. కానీ హిందీతో తెలంగాణ నిధులు మూటగట్టుకుంటోందని అంటున్నారు ఏపి నాయకులు.

Related posts:
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
గులాబీవనంలో కమలం?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
అహా... అందుకేనా..?!
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
మన ఖాతాలే మోదీ టార్గెట్?

Comments

comments