జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే

AP and TS discussed on Irrigation Projects

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదానికి కేంద్ర మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో ఓ చిన్నపాటి పరిష్కారం లభించింది. అయితే అన్ని సమస్యల మీద పరిష్కారం లభించకపోయినా, కొన్ని సమస్యలకు మాత్రం దిల్లీ వేదికగా పరిష్కారం లభించింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సాగునీటి శాఖ మంత్రులు, అధికారులు, ఇంజనీర్లు హాజరై  అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తమ తమ వాదనలు వినిపించారు. కానీ ఊహించినట్లే ఈ సమావేశంలో ఏ ఒక్క సమస్యకి పరిష్కారం కనుగొనలేకపోయారు. నిజానికి అవేవీ ఒక సమావేశంలోనే మాట్లాడేసుకొని పరిష్కరించేసుకోగల చిన్న సమస్యలు కావు కూడా.

ఈ సమావేశంలో మూడు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రుల మద్య ఏకాభిప్రాయం కుదిరిందని ఉమాభారతి చెప్పారు.
1.నీటి వాడకాన్ని లెక్క కట్టేందుకు టెలిమెట్రీ విధానం ప్రవేశపెట్టడం. దామాషా పద్దతిలో నీటిని వాడుకోవడం.
2.నీటి లభ్యతని అధ్యయనం చేసి ట్రిబ్యునల్ కి నివేదిక ఇచ్చేందుకు రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులు, కేంద్ర ప్రతినిధితో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం.
3.ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జలవివాదాలని ఈ మూడు పరిష్కార మార్గాలు కావని అర్ధం అవుతూనే ఉంది.  టెలిమెట్రీ విధానం ప్రవేశపెట్టడం మంచిదే కానీ రెండు రాష్ట్రాలు న్యాయంగా ఎవరి వాటా నీళ్ళని అవే వాడుకొనే ఆలోచనే ఉండి అసలు ఇది అవసరమే ఉండేది కాదు. కనుక ఈ పద్దతిలో నీళ్ళు వాడుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. అంతవరకు రెండు రాష్ట్రాలు చాలా సంయమనం పాటించవలసి ఉంటుంది. అప్పుడే ఈ పద్ధతి విజయవంతం అవుతుంది.

ఇంకా కమిటీ ఏర్పాటు చేయడం అంటే దానర్ధం సమస్యని వాయిదా వేయడమేనని చెప్పవచ్చు. అయినా కృష్ణా, గోదావరి బోర్డులనే ఖాతరు చేయని రెండు ప్రభుత్వాలు కమిటీ ఇచ్చిన సలహాలని పాటిస్తాయని ఆశించలేము. ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టులు నిర్మించడం తెలంగాణా ప్రభుత్వం ఊహించని విషయమే. తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకి సాంకేతిక కారణాల చేత నిలిపివేయమని ట్రిబ్యునల్ ఆదేశిస్తే నిలిపివేస్తుందా? అంటే కాదనే సమాధానం వస్తుంది. ఆ ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న కారణంగానే ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కానీ ఆ వివాదంపై ఎటువంటి పరిష్కారం కనుగొనకుండానే సమావేశం ముగిసింది. మొత్తానికి సమాధానంలేని ప్రశ్నలాగా ఈ మీటింగ్ ముగిసింది అన్నది మాత్రం వాస్తవం.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
అతడి అంగమే ప్రాణం కాపాడింది
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
తెలంగాణకు ప్రత్యేక అండ
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
చంద్రబాబు చిన్న చూపు
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
జియోకు పోటీగా ఆర్‌కాం
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
శోభన్ బాబుతో జయ ఇలా..
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
దేశభక్తి అంటే ఇదేనా?
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
మంత్రి గంటా ఆస్తుల జప్తు

Comments

comments