నింద్రాప్రదేశ్

Nindrandrapradesh

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నింద్రాప్రదేశ్ అనే పేరు కరెక్ట్ గా సరిపోతుంది అని అనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీతో, ప్రజా బలంతో వచ్చిన నారా చంద్రబాబు నాయుడు పాలనా తీరు ఏపికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏపిని నెంబర్ వన్ పొజిషన్ లో నిలబెట్టారు. అయితే ఇక్కడ నెంబర్ అంటే అభివృద్దిలో అనుకునేరూ.. కానే కాదు అవినీతిలో ఏపికి దేశంలోనే నెంబర్ వన్ ర్యాంక్ సాధించిపెట్టారు చంద్రబాబు నాయుడు. ఎప్పుడూ తాను నిప్పు అని చెప్పుకునే బాబుగారి ప్రభుత్వంలో అంతా అవినీతిమయంగా మారింది అని తేలిపోయింది.

ఇక రాష్ట్రం పరిస్థితి అలా ఉంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి మాత్రం మూలిగే నక్క మీద తాటిపడ్డ చందంగా మారింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు చెమటలుపట్టిస్తే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి ఆ కేసును తవ్వి తీశారు. కేసును విచారించాలంటూ ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్ పై ఏసీబీ విచారణకు ఆదేశించింది ఏసీబీ కోర్టు. దాంతో చంద్రబాబు అండ్ కో కు చెమటలు పట్టాయి. వెంటనే హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఇలా చంద్రబాబు నాయుడుతో సహా అందరూ కూడా పాలనపై కాకుండా కేసులపై శ్రద్దవహించడం లేదు. దాని వల్ల ప్రభుత్వంలోని పరిపాలనా వ్యవస్థ నిద్రావస్థలో ఉంది.

ఇక ఏపిని అభివద్ది వైపు పరుగులు పెట్టిస్తారు అనుకున్న చంద్రబాబు నాయుడు సీమాంధ్రులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నారు. తలసరి అప్పులో సీమాంధ్రులకే అప్పుల వాటా ఎక్కువగా ఉండటం దీనికి నిదర్శనం. అప్పుల జాబితాలో కూడా ఏపిని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపిన చంద్రబాబు నాయుడుకే ఈ క్రెడిట్ దక్కుతుంది. ఏపిలో ప్రజలు అప్పుల బాట పట్టడం.. దాని ద్వారా కాల్ మనీ అనే ఓ పెద్ద భూతం బయటపడటం కూడా చంద్రబాబు నాయుడు పాలనకు అద్దంపడుతోంది. ఉద్యోగ కల్పన హామీనిచ్చిన చంద్రబాబు ఉద్యోగాలు కల్పించడంతో విఫలమయ్యారు. అలా ప్రజలను మరింత అప్పులపాలు చేశారు.  మొత్తంగా చంద్రబాబు నాయుడు ఏపి ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తూ పాలనను బ్రష్టుపట్టిస్తూ చివరకు ప్రజలను అప్పుల ఊబిలోకి మరింత నెట్టుతున్నారు.

చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోనూ విఫలమవుతున్నారు. రైతు రుణ మాఫీ, డ్వాక్రా గ్రూపుల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిలాంటి వాటిని చంద్రబాబు నెరవేర్చడంతో విఫలమయ్యారు. రైతు రుణాలను మాఫీ చేస్తామని కేవలం కొన్ని రుణాలను అది కూడా బ్యాంకుల కండీషన్లకు లోబడి మాఫీ చెయ్యడం.. డ్వాక్రా గ్రూపులకు కూడా మాఫీ అని మోసం చెయ్యడం తీవ్ర అసహనానికి గురిచేస్తోంది.

దీనికి తోడుగా ల్యాండ్ పూలింగ్ పేరిట పచ్చటి పొలాలను రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లాక్కోవడం కూడా ప్రజలను తీవ్ర నష్టపరిచింది. తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో ఉండగానే కొంత వరకు కూలిపోవడం, అమరావతి నిర్మాణంలో అవకతవకలు జరగడం కూడా బాబు సర్కార్ కు మాయని మచ్చలాగా మారాయి. అమరావతి ఒక భ్రమరావతిగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి నిందలతో కూడి పరిపాలనలో నిద్రపోతున్న ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు నాయుడు నింద్రాప్రదేశ్ గా మార్చేశారు.

Related posts:
అమావాస్య చంద్రుడు
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
అమిత్ షా రేస్ లో... తుస్
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
నయిం కేసులో పెద్ద తలకాయలు
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
పవర్ లేని పవర్ ?
బాబు ఏమన్నా గాంధీనా?
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments