బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)

breafedme

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలాన్ని రేపిన ఓటుకు నోటు వ్యవహారంలో బాగా పాపులర్ అయిన పదం బ్రీఫ్డ్ మీ. నిజానికి ఇది ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ తో మాట్లాడుతూ అన్నమాట అని వార్త. కాగా నాటి ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నాడు సంఖ్యా బలంలేని తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎమ్మెల్సీలను గెలిపించుకునే ప్రయత్నంలో భాగంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, నాయకులకు డబ్బులిచ్చి ఓటును కొనుగోలు చెయ్యాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు రేవంత్ రెడ్డి మధ్యలో ఉండి సంబందాలు నెరిపినట్లు దేశం మొత్తం వీడియో ద్వారా తెలిసింది.

కాగా ఫోన్ సంభాషణల ఆడియో టేపుల్లో స్టీఫెన్ సన్ తో చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు సమాచారం అందింది. అప్పటికప్పుడు నగదుతో సహా రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు ఆయనను కోర్టుకు అప్పగించడం… తర్వాత కోర్టు ఆయనకు జైలుకు తరలించమని ఆదేశాలివ్వడం కూడా జరిగిపోయాయి. కాగా ఆ వ్యవహారం చిలికిచిలికి గాలి వానగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విద్వేషాలు చెలరేగాయి. ఎంతలా అంటే ఏ టైంలో అయినా ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీనామా చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంకు ఫిర్యాదు చేశారు.

ఓటుకు నోటు కేసు దరిమిలా తెలంగాణ సర్కార్ ఏపి ముఖ్యమంత్రి ఫోన్ ను ట్యాప్ చేసిందని కేసులు నమోదు చేసింది. దానిపై ఉన్నపళంగా విచారణకు ఆదేశించడంతోపాటు సిబిఐకి కూడా ఆదేశిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు మంచివి కావు అనే ఉద్దేశంతో నాటి కేంద్ర పెద్దలు ముఖ్యంగా వెంకయ్య నాయుడు దీనిపై సంధి కుదిర్చినట్లు సమాచారం.

ఏపిలో మంచి ఊపుమీదున్న ప్రతిపక్షపార్టీ వైసీపీ తీవ్ర స్థాయిలో ఉన్న ఓటుకు నోటు కేసును నీరుగార్చకుండా వైసీపీ అడ్డుకుంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ కేసును వెంటనే విచారించి వచ్చే నెల 29లోపు తమకు రిపోర్ట్ చెయ్యాలని ఆదేశాలివ్వడంతో మరోసారి ఓటుకు నోటు కేసు తెర మీదకు వచ్చింది. ఓటుకు నోటు కేసును దాదాపుగా మరిచిపోయారు అనుకున్న టైంలో మరోసారి తెర మీదకు రావడంతో చంద్రబాబును ఈ కేసు వదిలేది లేదు అంటోందా..? అని అందరూ అనుకుంటున్నారు. కాగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద నిందారోపణలున్నాయి. నోటు ద్వారా ఓటును ఖరీదు చెయ్యాలని చంద్రబాబు అనుకున్నట్లు, ఓ సిఎం ఫోన్ ను ట్యాపింగ్ కు ఆదేశించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు తెలంగాణ సిఎం కేసీఆర్ పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు ఈ కేసులో అరెస్టుల దాకా వెళితే దానికి కారకులైన వారిని(కేసీఆర్) వదిలేస్తారా..? అని పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు గుప్పుమంటున్నాయి.

Related posts:
లోకేష్ గ్యారేజ్.. పార్టీకి రిపేర్లు చెయ్యబడును
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
సింధూరంలో రాజకీయం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
పవన్ చంద్రుడి చక్రమే
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
బాబు Khan
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
తొక్కితే తాటతీస్తారు
చెత్త టీంతో చంద్రబాబు
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
పైసలు వసూల్ కాలేదుగా..

Comments

comments