ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న

Ap CM Chandrababu naidu failed to bring new currency

దేశం మొత్తం డబ్బుల కొరత ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఏం చేస్తారు? అని అనుకుంటున్నారా? కానీ వాస్తవం మాత్రం వేరేలా ఉంది. నారా చంద్రబాబు నాయుడు మేధావి, కేంద్రం నుండి ఏపికి ఎన్ని నిధులు కావాలో, ఎంత కరెన్సీ కావాలో అంత తెచ్చుకునే కెపాసిటీ ఉంది అని బాబు మీడియా కోడైకూసింది. అయితే అదంతా డొల్ల అని, బాబు ఉన్నా కానీ ఏమీచెయ్యలేని పరిస్థితిలో చేతులెత్తడంతో, ఏపి ప్రజలు నానా కష్టాలుపడుతున్నారు. ఇదే అంశాన్ని ఏపి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ గుర్తించి, గవర్నర్ కు లేఖ రాశారు.

దేశం మొత్తంలో డీమానిటైజేషన్ దెబ్బతో కరెన్సీకి కష్టాలు మొదలయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా కరెన్సీ కష్టాలు ఉంటున్నా.. కేంద్రం కొత్త కరెన్సీని సప్లై చేస్తోంది. కేంద్రం 5.5 లక్షల కోట్లను కేంద్రం సప్లై చేస్తుండగా, అందులో ఏపికి కేవలం 14,740 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. నిజానికి కేంద్రం రాష్ట్రంలోని జనాభా ప్రతిపదికన 20 వేల కోట్లు కేటాయించాలి కానీ కేంద్రం మాత్రం వివక్ష చూపించింది. అయితే దీనిపై జగన్ ప్రశ్నించారు. కనీసం జనాభా దామాషా కింద అయినా ఏపికి ఎక్కువ కరెన్సీని సప్లై చెయ్యాలని గవర్నర్ ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. అయితే డీమానిటైజేషన్ మీద అధ్యయనం కోసం రాష్ట్రాల సిఎంల బృందాన్ని ఏర్పాటు చేసి, దానికి చంద్రబాబు నాయుడును దానికి నేతృత్వం వహిస్తున్నారు. దీనిపై బాబు మీడియా జబ్బలు తరుచుకుంది. కానీ వాస్తవానికి కరెన్సీని తెప్పించడంలో మాత్రం విఫలమయ్యారు.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
స్థూపం కావాలి
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
ఆ నోట్లను ఏం చేయబోతున్నారంటే..
అందుకే భూకంపం రాలేదట
యాహూ... మీ ఇంటికే డబ్బులు

Comments

comments