ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్

AP CM Chandrababu Naidu will expand his cabinet soon

AP CM Chandrababu Naidu will expand his cabinet soon. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

ఏపీ కేబినెట్‌లో కొంద‌రు మంత్రుల‌కు ఉద్వాస‌న ప‌లికే అవ‌కాశం ఉంది. గత కొంత కాలంగా వినిపిస్తున్న ఏపి కేబినెట్ విస్తరణకు తొందరలోనే ముహూర్తం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కొంతమంది కేబినెట్ సహచరులు, పలువురు ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం పేరిట నిర్వహించిన భేటీ సందర్భంగా చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తప్పదన్న చంద్రబాబు… ఎప్పుడు జరుపుతామన్న విషయాన్ని మాత్రం దాటవేసి ఆశావహుల్లో ఉత్కంఠకు తెర తీశారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సహా 25 మంది దాకా ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో చంద్రబాబు కేబినెట్ విస్తరణ ప్రస్తావన తెచ్చారు.

‘‘ఇప్పుడు మంత్రివర్గంలో 20 మంది ఉన్నారు. ఇంకా ఇద్దరో, ముగ్గురో రావడానికి అవకాశముంది. అందుచేత పునర్ వ్యవస్థీకరణ ఉంటుంది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే కేబినెట్ విస్తరణను ఎప్పుడు చేపట్టనున్నది మాత్రం ఆయన ప్రస్తావించలేదు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేపడతారంటూ సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు అడగలేకపోయారు. అయితే మునిసిపల్ ఎన్నికల తర్వాత ఈ ఏడాది చివరలో ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే కేబినెట్‌లో ఇప్పటికే కొంద‌రు మంత్రులు ముభావంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌మ త‌మ శాఖ‌ల‌కు సంబంధించిన కార్య‌క‌లాపాల్లో వెన‌క‌బ‌డిపోతున్నారు. చంద్ర‌బాబు ఆదేశిస్తే గానీ ఏపనీ చేయ‌ని వారు కొంద‌రు. త‌మ శాఖ‌లో ఏ నిర్ణ‌యం తీసుకోవాలో తెలియ‌క మంత్రి హోదాలో కొన‌సాగుతున్న వారు ఇంకొంద‌రు. ఇలాంటి వారిపై వేటు ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం… ఇప్ప‌టికే రెండు సార్లు మంత్రుల‌ను మార్చింది. ఏపీ స‌ర్కారు కూడా త్వ‌ర‌లో ఇదే నిర్ణ‌యం తీసుకుంటుంద‌నే ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి. అయితే వేటుకు గుర‌య్యే మంత్రులెవ‌రో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బాబుగారి చిరు ప్లాన్
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!

Comments

comments