నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం

AP Govt declare No Unemployment allowance

ఏపిలో అధికారానికి రాక ముందు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతను ఆకర్షించేందుకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఒడ్డుకు చేరిన తర్వాత తెడ్డుతగలేసిన చందాన చంద్రబాబు నాయుడు నడుచుకుంటున్నారు. అధికారానికి రావడానికి సవాలక్ష హామీలిస్తాం కానీ వాటిని అమలు మాత్రం చెయ్యం అని పరోక్షంగా, దాదాపుగా స్పష్టంగా చెప్పింది బాబు సర్కార్. ఇప్పటికే చాలా హామీలను తుంగలో తొక్కిన సర్కార్ మొదటిసారి అధికారికంగా పలానా హామీని మేం నెరవేర్చలేం అని స్పష్టం చేసింది.

ఎన్నికల టైంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక హామీని ఇచ్చుకుంటుపోయారు చంద్రబాబు. మహిళలకు, వృద్ధులకు, రైతులకు చివరకు నిరుద్యోగులకు కూడా హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే అన్ని హామీలను నెరవేర్చని బాబు సర్కార్ తాజాగా నిరుద్యోగులకు నిలువునా మోసం చేస్తోంది. డిగ్రీ చదివిన నిరుద్యోగులు ఉద్యోగం పొందే వరకు నెలవారి ఖర్చు కోసం నెలకు రెండు వేల రూపాయలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ తాజాగా ఏపి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం నిరుద్యోగ భృతి ఇవ్వలేం అని తేల్చేశారు. దానికి బదులుగా యూత్ పాలసీని తీసుకువచ్చి.. యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని కొత్త కథలు చెప్పారు.

బాబుగారు చెప్పిందేమిటి..? చేసిందేమిటి?
– జాబు రావాలంటే బాబు రావాలని ఊదరగొట్టారు
– ఇప్పటి వరకు ఒక్క రిక్రూట్ మెంట్ కూడా జరగలేదు
– రెగ్యులరైజేషన్ కోసం వీఆర్ఏలు పోరాటం చేస్తున్నారు
– హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీలు మూసివేస్తున్నారు
– 7 వేల ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తున్నారు
– ఇప్పుడు పరిశీలన మాత్రమే చేస్తామని బుకాయిస్తున్నారు
– గోపాలమిత్ర, ఆరోగ్యమిత్ర, ఆదర్శ రైతులను తొలగించారు

Related posts:
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
బాబోయ్ బాబు వదల్లేదట
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
నయీం రెండు కోరికలు తీరకుండానే...
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
స్టే ఎలా వచ్చిందంటే..
తెలంగాణకు ప్రత్యేక అండ
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
ఏపీకి ఆ అర్హత లేదా?
తిరిగబడితే తారుమారే
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
జియో భారీ ఆఫర్ తెలుసా?
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

Comments

comments