పోలవరం దోపిడి…. చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం

Ap govt Polavaram project scam

ఏపిలో రాజకీయం మరింత రంజుగా మారింది. అక్కడ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం చూపిస్తున్న నిర్లిప్తత చివరకు అవినీతికి అవకాశం కల్పిస్తోంది. కాగా దీనిపై ఏపి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ గట్టిగా నిలదీస్తున్నారు. వైయస్ జగన్ గత అసెంబ్లీ సమావేశాల్లో తాను ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాదు అని కానీ నిర్వాసితులకు తగిన న్యాయం చేసి, నిజాయితీగా ప్రాజెక్టును పూర్తి చెయ్యాలని చాలా క్లీయర్ గా చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం జగన్ పోలవరానికి అడ్డుపడుతన్నారని, కానీ చంద్రబాబు ఎంతో కష్టపడి దానిని నిర్మించే ప్రయత్నం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తోంది. అసలు పోలవరం ప్రాజెక్టు కథ ఏంటో తెలుగోడ పాఠకుల కోసం ప్రత్యేకంగా..

పోలవరం ఎప్పుడు వచ్చింది..?
గోదావరి జలాలను సద్వినియోగం చేస్తూ  ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో మరింత సాగును అందుబాటులోకి తీసుకురావడానికి 1980లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి టి. అంజయ్య పోలవరం ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. తరువాత 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావూ పోలవరం ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారు. నాటి నుంచి నేటి వరకూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు తమ పాలనలో ప్రతి ఏటా బడ్జెట్‌లో నామమాత్రంగా నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పెంచుతూ పోయారే తప్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని మాత్రం చేపట్టలేకపోయారు.

పోలవరం వల్ల వచ్చేదేమిటి..?
ఏపిలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, కృష్ణ  జిల్లాల్లో 7లక్షల 20 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఉద్దేశించింది. వీటితోపాటు విశాఖ జిల్లాలో తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు మరో 23.44 టీఎమ్‌సిల నీటిని తరలించనున్నారు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పతి అవుతుంది.  పోలవరం నిర్మాణం పూర్తయితే మొత్తం 273.04 టీఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణానదికి మళ్ళించవచ్చు. కుడికాలువ ద్వారా ప్రకాశం బ్యారెజీ ఎగువభాగంలో పోలవరం నీరు కలుస్తుంది. అంతేకాదు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఇలా మళ్ళేంచే 80 టీఎంసీలలో 21 టీఎంసీలు కర్నాటకకూ, 14 టీఎంసీలు మహారాష్ట్రకు వెళతాయి.

చంద్రబాబు చేస్తున్నది ఏమిటి..?
ముందుగా చంద్రబాబు నాయుడు సర్కార్ దీనిని సాగునీటిని అందించే ప్రాజెక్టుగా కన్నా కమీషన్లు తెచ్చిపెడుతున్న అతి పెద్ద ప్రాజెక్టుగా భావిస్తోంది. అందుకే కేంద్రం నుండి అనుమతులను చంద్రబాబు నాయుడు హుటాహుటిని తెప్పించుకున్నారు. ఒరిశా, మహారాష్ట్ర దీనిపై వ్యతిరేకత వ్యక్తం చెయ్యడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు వైఖరే. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉన్న వారికి కేటాయించారని, ప్రాజెక్టు అంచనాలను అంతకంతకు పెంచుకుంటూ 2010-11 ధరల ప్రకారం పది వేల కోట్లు అని వెల్లడించారు. అయితే పోలవరంలో చోటుచేసుకుంటున్న అతి పెద్ద అవినీతి బాగోతాన్ని జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

జగన్ ఏం కోరుకుంటున్నారు..?
పశ్చిమగోదావరి జిల్లాలతో పాటుగా మరికొన్ని జిల్లాలకు లబ్ది చేకూర్చే పోలవరం ప్రాజెక్టు మీద జగన్ వ్యతిరేకంగా లేరు.. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలవరం మీద వేస్తున్న అడుగులు మాత్రం సరిగ్గాలేవని వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేలా చంద్రబాబు నాయుడు రాత్రి రాత్రి జివో నెంబర్ 22ను ఇచ్చి.. అవినీతికి తలుపులు బార్లా తెరిచారని జగన్ ముందు నుండి మండిపడుతున్నారు. పైగా పోలవరం లక్ష్యాలను అతిగా చేసి చూపుతున్నారని కూడా జగన్ మండిపడుతున్నారు.

అన్నింటికి మించి పోలవరం ప్రాజెక్టు వల్ల 380 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. దాదాపుగా 1లక్షమంది జనాలు తమ గ్రామాలను ఖాళీ చెయ్యాల్సిన పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 205 ఆవాసాలు మాత్రమే ముంపుకు గురవుతున్నాయని ప్రకటించడం మీద జగన్ మండిపడుతున్నారు. ముంపు బాధితులకు పునరావాసాలు కట్టించాలనేి, ఏడాది వరకు జీవనభృతి చెల్లించాలని, అర ఎకరా వరకు భూమిని ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చెయ్యడంలో చంద్రబాబు నాయుడు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అని జగన్ మండిపడుతున్నారు. కేంద్రం జాతీయ హోదా ప్రకటించిన పోలవరానికి ఎంత డబ్బులిస్తామన్న దానిపై క్లారిటీ లేదు. కేంద్రం ప్రకటించిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును కేంద్రం నిధులతో పూర్తి చెయ్యాలి. కానీ ఇందులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల గురించి ఎక్కడా చర్చించలేదు. వాటిని ఇస్తామని కూడా కేంద్రం ప్రకటించలేదు.

ఇప్పటికే అవినీతిలో ఏపి పేరు జాతీయ స్థాయిలో నిలబెట్టిన చంద్రబాబు నాయుడు.. పోలవరం పేరుతో కాంట్రాక్టర్లకు వరాలు అందిస్తున్నారు అన్నది సత్యం. అయితే దీన్ని ఎవరు వ్యతిరేకిస్తే వాళ్లను మాత్రం ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని, నీరందించకుండా కరువు ఉండాలని కోరుకునే వ్యక్తులు అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. తాజాగా కేంద్రం కూడా ప్రత్యేక ఆర్థిక సహాయంలో భాగంగా పోలవరాన్ని కూడా చేర్చడం జగన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. గతంలోనే కేంద్రం పోలవరానికి జాతీయహోదా కల్పించింది. ఇలా పోలవరం మీద జరుగుతున్న అన్యాయాన్ని ఎదురిస్తున్నారు జగన్.

Related posts:
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
సింధూరంలో రాజకీయం
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
పవన్ క్షమాపణలు చెప్పాలి

Comments

comments