మంత్రి గంటా ఆస్తుల జప్తు

AP Minister Ganta Srinivasa Rao Properties Seized By Indian Bank

నొప్పించక, తానొచ్చక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని వేమన చెప్పిన లైన్లను తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు ఏపికి చెందిన రాజకీయ నాయకులు. అయితే తప్పించుకు తిరగడం అంటే పాపం బ్యాంకు బాకీలను ఎగ్గొట్టి తప్పించుకు తిరగడం అని అర్థమౌనట్లుంది. అందుకే బ్యాంకుల వద్ద చేసిన అప్పులను తీర్చకుండా అలా.. కాలం వెల్లదీస్తున్నారు. అయితే ప్రతి పైసాను ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకు వాళ్లకు ఎవరైనా ఒక్కటే. అందుకే తాజాగా ఏపి మంత్రి గంటా శ్రీనివాస్ గారి ఆస్తులను జప్తు చేస్తూ బ్యాంకు నోటీసులు జారీచేసింది. అవును.. మీరు చదువుతున్నది అక్షరాల వాస్తవం. అసలు మ్యాటర్ ఏంటో మొత్తం ఆర్టికల్ చదివితే మీకే అర్థమవుతుంది.

సుజనా చౌదరి, మొన్న రాయపాటి, నేడు గంటా శ్రీనివాస్ రావు. ఇలా అందరూ బ్యాంకుల వద్ద కోట్ల రూపాయలు అప్పులు చేసి వాటినికట్టకుండా తిరుగుతున్నారు. ఒక‌టా…రెండా ఏకంగా 200 కోట్లు ఎగ‌నామం పెట్టేశారు ఏపి మంత్రి గంటా శ్రీనివాస్ రావు. గంటా శ్రీనివాస‌రావు కిచెందిన ప్ర‌త్యూష రీసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా కంపెనీ పేరుతో ఇండియ‌న్ బ్యాంకులో 200 కోట్ల రూపాయ‌ల రుణం తీసుకున్నారు. వ‌డ్డీల‌తో క‌లిపితే అది చాలా పెద్ద‌మొత్త‌మే అవుతుంద‌ని స‌మాచారం.అ యితే వాటిని చెల్లించ‌కుండా మంత్రి గారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలో చేరుతూ చ‌క్రం తిప్పుతున్నారు. దాంతో చాలాకాలం పాటు స‌హ‌నంగా ఎదురుచూసిన బ్యాంకు సిబ్బంది ఎట్ట‌కేల‌కు ఆస్తుల జ‌ప్తునకు బ‌రిలో దిగారు.

అక్టోబ‌ర్ 4నాడు నోటీసులు ఇచ్చినప్ప‌టికీ స్పందించ‌క‌పోవ‌డంతో గ‌డిచిన వారంలో జ‌ప్తు ప్ర‌క్రియ పూర్తిచేసేశారు. అప్పుకు హామీదారుడిగా ఉన్న గంటా ఆస్తులు స‌హా ప‌లు ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌త్యూష కంపెనీ డైరెక్ట‌ర్లు, అప్పులు హామీదారులంద‌రి ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వారిలో గంటా కీల‌క అనుచ‌రుడు, భీమిలి నియోజ‌క‌వ‌ర్గ ఇన్ ఛార్జ్ ప‌రుచూరి భాస్క‌ర్ రావు ఆస్తులు కూడా ఉన్నాయి.

స్వాధీనం చేసుకున్న గంటా ఆస్తులు:
– బాల‌య్య శాస్త్రి లే అవుట్ లో స‌ర్వే నెంబ‌ర్ 20 లో 444 చ‌.గ భూమి
– కూర్మ‌న్న‌పాలెంలో 13జ‌20,21,22 లో మొత్తం 1443 చ‌.గ భూమి
– అన‌కాప‌ల్లి స‌మీపంలోని పూడిమ‌డ‌క జంక్ష‌న్ లో ఎన్ హెచ్ ను ఆనుకుని 0.66 ఎక‌రాల భూమి
– చోడ‌వ‌రం మండ‌లం కొత్తూరు మెయిన్ రోడ్డులో 1355 చ‌.గ భూమి, నిర్మించిన ఆస్తి
– ఎంవీపీ కాల‌నీలో గంటా పేరుతో ఉన్న హెచ్ఐజీ ప్లాట్ నెంబ‌ర్ 231 లో నివాస భ‌వ‌న ఆస్తి

మొత్తానికి ఏపి మంత్రిగారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లుగా బ్యాంకు వెల్లడించిన ప్రకటన ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. అయినా మంత్రిగా ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా బ్యాంకులకు ఎగనామం పెడితే పాపం.. సామాన్యులు మాత్రం ఎలా తీసుకుంటారు.

Related posts:
ఆయనకు వంద మంది భార్యలు
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
వీళ్లకు ఏమైంది..?
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
ఏపీకి ఆ అర్హత లేదా?
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
బెంగళూరుకు భంగపాటే
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
వంద, యాభై నోట్లు ఉంటాయా?
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
బాబును వదిలేదిలేదు
వార్దాకు వణికిపోతున్న చెన్నై
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments