అహా… అందుకేనా..?!

AP Minister invited Junior NTR for Krishna Pushkaralu behalf of Chandrababu Naidu

ఏపిలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి డైలమాలో పడ్డారా..? ఆయన వస్తే తనకు గండం తప్పదు అనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ను మళ్లీ దగ్గరికి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎన్టీఆర్ తో జరిగిన ఓ ఘటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే ఏపీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాధ్ రెడ్డి ఎన్టీఆర్ ఇంటికెళ్ళి ఆయ‌న‌కు ఆహ్వ‌న ప‌త్రిక‌ను అందజేసారు. ఏపి ప్రభుత్వం తరఫున అందిన ఈ ఆహ్వానం వెనక చంద్రబాబు భయం ఉంది అని పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్ గా నడుస్తోంది.

తెలుగుదేశం వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్ లు తెలుగుదేశంలో కీలకం. అయితే తెలుగుదేశం పార్టీలో కొన్ని పరిణామాలు చోటుచేసుకోవడంతో హరికృష్ణను కాస్త పక్కనబెట్టి బాలకృష్ణకు చంద్రబాబు పార్టీలో ముఖ్య భూమిక ఇచ్చారు.  బాల‌కృష్ణ క్రియాశీల రాజ‌కీయాల్లో ఉన్నా ఆయ‌న బాబుగారి వియ్యంకుడు క‌నుక ఆయ‌న్నుంచి చంద్ర‌బాబుకు ఎటువంటి హాని లేదు. ఇక మిగిలింది ప్ర‌జ‌ల్లో మంచి ప్ర‌జాద‌ర‌ణ ఉంది ఒక్క జూనియ‌ర్ ఎన్టీఆర్ కే. ఈ విష‌యాన్ని గ‌మ‌నించే ఆయ‌న వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి జూనియ‌ర్ ను పార్టీ నుంచి దూరంగా పెట్టారు.

అయితే ఏపిలో అంతకంతకు మారుతున్న పరిణామాల కారణంగా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత పెరుగుతోంది. ఫలితంగా జగన్ తో పాటు మరో ప్రత్యామ్నాయం కోసం జనాలు చూస్తున్నారు సరిగ్గా ఇక్కడే పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పవన్ బాగా బలపడితే అది ఖచ్చితంగా తెలుగుదేశంకు ముప్పేనని, ఆ భయంతోనే చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ ను మరోసారి దగ్గరికి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
బాబుగారి చిరు ప్లాన్
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
ఓటుకు నోటు కేసును మూసేశారా?
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments