ఏపిలో జగన్ Vs పవన్

AP People thinking about Pawan Kalyan after Jagan

ఏపిలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. చాలా కాలం క్రితమే జనసేన పార్టీని స్థాపించినా కానీ రాజకీయంగా ముందుకు అడుగులు మాత్రం వెయ్యలేదు. కానీ తన అభిమాని మృతితో ఒక్కసారిగా పవన్ తెర మీదకు వచ్చారు. అయితే ఈ సారి ఏ ప్రెస్ మీట్ తోనో లేదంటే ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్ తోనో కాదులెండి. పక్కాగా పొలిటికల్ స్కెచ్ తో ముందుకు వచ్చారు. పవన్ తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. ఇప్పుడు ఏపిలో పవన్, జగన్ లలో ఎవరు ముందుంటారు అన్న దానిపై తీవ్ర చర్చ సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో విభజన తర్వాత నారా చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపట్టారు. కానీ తర్వాతర్వాత మాత్రం పరిస్థితులు మారి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ తరుణంలో జగన్ తన ప్రాభల్యాన్ని పెంచుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో గట్టి వాయిస్ ను వినిపించిన వైసీపీ అధినేత జగన్ చంద్రబాబుకు మరో ప్రత్యామ్నాయంగా మారారు. అయితే ఇప్పుడు పవన్ ఎంట్రీతో పరిస్థితి మరింత రంజుగా మారింది.

తిరుపతి సభతో పొలిటికల్ గా ఫుల్ ఎనర్జీతో దిగుతున్న పవన్ కళ్యాణ్ తో ఏపి రాజకీయాల్లో పోటీవాతావరణం నెలకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముందు నుండి అధికారపార్టీ తప్పులను ఎత్తిచూపుతూ ప్రజల్లోనే ఉంటున్నారు జగన్. ఇది జగన్ కు బాగా కలిసివచ్చే అంశం. కానీ పవన్ ఇప్పటి నుండి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాలి. ఇప్పటికే రన్సింగ్ రేస్ లో సగం దాకా వచ్చిన జగన్ కు(ఎన్నికలు జరిగి రెండున్నర సంవత్సరాలైంది), ఇప్పుడు రన్సింగ్ రేస్ కోర్ట్ లోకి అడుగుపెట్టిన పవన్ కు ఖచ్చితంగా తేడా ఉంది. కానీ ఫైనల్ గా చంద్రబాబు నాయుడుకు ఈ ఇద్దరి వల్ల పెద్ద దెబ్బ అన్నది మాత్రం ఖాయం.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
పంజా విసిరిన జననేత
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
బాబుగారి చిరు ప్లాన్
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!

Comments

comments