పది వేల ఉద్యోగాలు పాయే… ఇదంతా చంద్రబాబు పుణ్యమే!

AP Youth may loose ten thousand jobs in Mannavaram BHEL by Chandrababu Naidu decision

ఏపిలో నారా చంద్రబాబు నాయుడు పాలన ఎంత బా…గా ఉందో చెప్పక్కర్లేదు. ఇంటికో ఉద్యోగం సంగతి దేవుడికే తెలియాలి.. కానీ ఉన్న ఉద్యోగాలను కాపాడటంలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన చిత్తూరు జిల్లా మన్నవరం బిహెచ్‌ఇఎల్‌ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. 2015 నాటికి ప్రాజెక్టు ఆపరేషన్స్‌ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ యూనిట్‌ నిర్మాణ పనులు మాత్రం ఇప్పటికీ కించెత్తు కదలలేదు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మన్నవరం భెల్ ప్రాజెక్టు రాష్ట్రానికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తర్వాత రెండోవ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎన్‌బిపిపిఎల్‌ పేరుగాంచినా, మన ప్రభుత్వానికి ఇవేమీ పట్టకపోవడం గమనార్హం. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఎన్‌బిపిపిఎల్‌ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన తర్వాత.. వైఎస్‌ఆర్‌ పురం మన్నవరం బెల్‌ పనులపై రాష్ట్ర ప్రభుత్వం అటువైపు కన్నెత్తిచూసిన పాపనపోలేదు. ఇటు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై దృష్టి సారించడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టు ద్వారా రావలసిన దాదాపుగా 10 వేల ఉద్యోగాలు దాదాపుగా గాలిలో దీపాలే అని అనుకోవచ్చు. దీనిపై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మ‌ధుసూధ‌న్ రెడ్డి  ఘాటుగా స్పందించారు. పది వేల ఉద్యోగాలు తరలిపోతున్నా చంద్రబాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌బిపిపిఎల్‌ను రూ. 6 వేల కోట్ల పెట్టుబడితో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేత ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య శంకుస్థాపన చేసినప్పటికీ.. అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలతో వైఎస్‌ఆర్‌ మన్నవరం బెల్‌ మరుగున పడింది. ప్రస్తుతం మన్నవరం బెల్‌లో ఏమీ జరుగుతుందో..? కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై నెలకొకసారి నిర్మాణ పనులపై సీఎం స్థాయిలో సమీక్ష నిర్వహించినా తక్కువేనని, రాజకీయ కారణాలతో ఎన్‌బిపిపిఎల్‌ వంటి ప్రాజెక్టుపై ప్రభుత్వం పట్టింపులకు పోవడంపై స్థానిక ప్రజలు భగ్గుమంటున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యానికి దాదాపుగా 10వేల ఉద్యోగాలు గాలిలో కలిసినట్లు దాదాపు తెలుస్తోంది. చంద్రబాబు చలవతో ఉన్న ఉద్యోగాలు ఊస్టింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది.

Related posts:
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
అమ్మకు ఏమైంది?
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
బాబు బిత్తరపోవాల్సిందే..
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
2018లో తెలుగుదేశం ఖాళీ!
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
జియోకు పోటీగా ఆర్‌కాం
అకౌంట్లలోకి 21వేల కోట్లు
ట్రంప్ సంచలన నిర్ణయం
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments