పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ

Are you using paytm then know this news

దేశం మొత్తం పెద్దనోట్ల రద్దు తర్వాత కకావికలమయ్యాయి. దేశంలోని చాలా కంపెనీలు దాదాపుగా కొన్నాళ్లు మూసుకుంటే బెటర్ అనే నిర్ణయానికి కూడా వచ్చాయి. అయితే దేశంలో ఒక్క కంపెనీ మాత్రం లాభాలతో ఉరకలేసింది. అప్పటిదాకా ఉన్న కంపెనీ లాభాలు వందలరెట్లు పెరిగి.. దేశంలో కొత్త ట్రెండ్ సృష్టించింది. ఇంతకీ ఆ కంపెనీ ఏంటో అనుకుంటున్నారా? అదేనండీ మనం వాడుతున్న పేటిఎం. అవును పేటిఎం అయితే తాజాగా పేటిఎంలో కొన్నా వార్తలు వినిపించడం కస్టమర్లను కలవరపెడుతోంది.

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇప్పుడు డిజిటల్ బాట పట్టారు. దీంతో మొబైల్ వ్యాలెట్లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్, మొబైల్ వ్యాలెట్ల గురించే వినపడుతున్నాయి. డిజిటల్ లావాదేవీలపై ఇంకా పూర్తిస్థాయి పట్టులేకపోవడంతో ప్రజలు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందులో తాజాగా పేటీఎం యూజర్లకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. పేటీఎం యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పేటీఎం వ్యాలెట్ లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడం కూడా కుదరడం లేదని గగ్గోలు పెడుతున్నారు. వ్యాలెట్ లో ఉన్న నగదును తమ బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేయాలనుకున్నా సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. లావాదేవీలు పదేపదే విఫలం అవుతున్నాయని యూజర్లు ఆరోపిస్తున్నారు.

దీంతో ఒకపక్క నగదు కొరతతో వ్యాలెట్లను ఆశ్రయిస్తున్న జనాలకు మరోరకం కొత్త సమస్యల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. యూజర్ల ఫిర్యాదులపై పేటీఎం అధికార ప్రతినిధి స్పందించారు. సర్వర్లకు సరిగా అనుసంధానం కాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ అయిన సొమ్ము ఏ కారణంగానైనా వ్యాలెట్‌లో జమకాకపోతే 48 గంటల తర్వాత ఆటోమెటిక్‌గా సమస్య పరిష్కారం అవుతుందని వివరించారు. పాపం కొద్దిసేపు తమ డబ్బులు కనిపించడకపోవడంతో కస్టమర్లు పేటిఎం మీద ఫిర్యాదులకు సిద్ధమవుతున్నారు. గతంలో పేటిఎం అకౌంట్లు హ్యాక్ అయ్యాయి అన్న వార్త కూడా తీవ్ర సంచలనం రేపింది.

Related posts:
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
పెట్రోల్ లీటర్‌కు 250
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
సల్మాన్ ఖాన్ నిర్దోషి
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
నయీం రెండు కోరికలు తీరకుండానే...
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
రాజీనామాలు అప్పుడే
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
బిచ్చగాళ్లు కావలెను
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
బంగారం బట్టబయలు చేస్తారా?
పాపం.. బాబుగారు వినడంలేదా?
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments