అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!

Arnab Goswami to get security cover over threat from Pak-based terror groups

రాజకీయ ప్రముఖులకు భద్రత కల్పించడం మామూలే. రాజకీయాల్లో బాగా కీలకమైన వాళ్లకు మరింత భద్రత కల్పిస్తూ కేటగిరిల వారిగా భద్రత కల్పిస్తారు. కేంద్రం ఎంతో నైపుణ్యం ఉన్న వాళ్లను ఈ భద్రత కోసం ఎంపిక చేస్తారు. కాగా తాజాగా ఓ ఛానల్ చీఫ్ ఎడిటర్ కు ఏకంగా ‘వై’ కేటగిరి భద్రతను కల్పించడం వార్తల్లో నిలిచింది. టైమ్స్‌నౌ ఛానల్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అయిన అర్నబ్ టీవీ షోలలో పాకిస్తాన్ పై అనేక విమర్శలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం పరిస్థితిపై టైమ్స్ నౌ ఛానల్ ఆయన చేసిన కార్యక్రమాలు ఉగ్రవాదులను, పాక్ ను తీవ్రంగా తప్పుబట్టేలా ఉన్నాయి.

దీంతో ఉగ్రవాదులు అతనిని టార్గెట్ చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. దీంతో వై కేటగిరీ భద్రతను కల్పించారు. దీంతో 24 గంటలూ అర్నబ్ చుట్టూ 20 మంది భద్రతా సిబ్బంది, ఇద్దరు అధికారులు ఉంటారు. ఈ స్థాయిలో భద్రత అందుకున్న మొదటి జర్నలిస్టు అర్నబే.

వై కేటగిరి కింద రెండు రకాల వ్యక్తులకు భద్రత కల్పించే వీలుంటుంది. ప్రభుత్వంలో పొజిషన్ ను బట్టి అంటే మంత్రులకు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు వై కేటగిరీ భద్రత ఉంటుంది. అలా కాకుండా ఎవరికైనా ముప్పు ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించినా కూడా వారికి వై కేటగిరి భద్రతను కల్పిస్తారు. అర్నబ్ గోస్వామి ముంబైలో నివసిస్తుండడంతో అతని రక్షణ బాధ్యతను మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది కేంద్రం.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
అతడి అంగమే ప్రాణం కాపాడింది
అతడికి గూగుల్ అంటే కోపం
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
బావర్చి హోటల్ సీజ్
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
మోదీ చేసిందంతా తూచ్..
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..

Comments

comments