అర్నాబ్ గోస్వామి రాజీనామా ఎందుకు? సోషల్ మీడియాలో వెరైటీ స్పందన

Arnad Gosami quit for Times Now

దేశంలో మీడియా గురించి కాస్తోకూస్తో తెలిసిని వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు అర్నాబ్ గోస్వామి. టైమ్స్ నౌ న్యూస్ ఛానల్ లో అర్నాబ్ చేసిన న్యూస్ అవర్ ప్రోగ్రాం చాలా పాపులర్ అయింది. అయితే తాజాగా అర్నాబ్ గోస్వామి ఉన్నట్టుండి రాజీనామా చేయడం సంచలనం రేపింది. కొద్ది రోజుల క్రితం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌వాదులు కూడా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దాంతో ప్ర‌భుత్వం కూడా భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేసింది. ఆయ‌న‌కు ఇద్ద‌రు అధికారుల‌తో పాటు మొత్తం 20మంది సిబ్బందితో కూడిన భ‌ద్ర‌త‌ను కేంద్రం కేటాయించింది. నిరంత‌రం ఆయ‌న ర‌క్ష‌ణ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

అంత‌కుముందు కూడా ప‌లువురు జ‌ర్న‌లిస్టుల‌తో అర్న‌బ్ గొడవ పెట్టకున్నారు. ఎన్డీటీవీలో ఎంతో కీలకంగా ఉన్న సీనియర్ జర్నలిస్ట్, ఇన్ పుట్ ఎడిటర్ బ‌ర్ఖాద‌త్ వంటి వారిపై నోటిదురుసుతో చేసిన వ్యాఖ్య‌లు కొంత క‌ల‌క‌లం రేపాయి. సాటి విలేక‌ర్ల‌తో పాటు రాజ‌కీయ నేత‌లు స‌హా అంద‌రి మీద ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌ల ప్ర‌తాపం క‌నిపించేది. ఇక బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కీల‌క స‌మయాల్లో మోడీకి అనుకూలంగా అర్న‌బ్ త‌న వాద‌న‌ను వినిపించ‌డం కోసం అంద‌రి మీద విరుచుకుప‌డుతున్నార‌నే ప్ర‌చారం కూడా సాగింది.

మోదీ ప్రభుత్వానికి ఆపద టైంలో సపోర్ట్ గా ఉన్న అర్నాబ్ ఎన్నో స్కాంలను వెలుగులోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. 2జీ స్కాం, కామన్ వెల్త్ గేమ్స్, కోల్ స్కాంలను వెలుగులోకి తీసుకురావడంతో అర్నాబ్  మీడియాపరంగా ప్రభుత్వం మీద తీవ్ర వత్తిడి చేశారు. పాకిస్థాన్ భారత్ మీద చేస్తున్న దాడుల మీద కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఉగ్రదాడుల నేపథ్యంలో కూడా అర్నాబ్ ఎంతో ఆసక్తికర చర్చకు దారి తీశారు. కాగా తాను ఇప్పుడు రాజీనామా చేసినా కానీ మీడియాలో కొనసాగుతానని అర్నాబ్ స్పష్టతనిచ్చారు. కాగా అర్నాబ్ రాజీనామాపై సోషల్ మీడియాలో చాలా వైవిధ్యమైన స్పందన వచ్చింది.

అర్నాబ్ గోస్వామికి టాటా సన్స్ గ్రూప్ చైర్మెన్ పదవి వచ్చిందని అందుకే ఆయన టైమ్స్ నౌకు రాజీనామా చేశారని సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. మరో నెటిజన్ అర్నాబ్ ను భారత ప్రభుత్వం ఆర్మీ చీఫ్ గా నియమించిందని, అందుకే రాజీనామా చేశారని వ్యాఖ్య కూడా ఉంది. నేషన్ వాంట్స్ టు నో.. అర్నాట్ క్విట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇలా రకరకాలుగా నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందించారు.

Related posts:
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
కాటేసిందని పాముకు శిక్ష
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
సౌదీలో యువరాజుకు ఉరి
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
మోదీ ప్రాణానికి ముప్పు
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ పేలుళ్ల బాధితులకు ఉరిశిక్ష
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు

Comments

comments