మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’

Arvind Kejriwal Fire on Modi For Phone Issue

Arvind Kejriwal Fire on Modi For Phone Issue. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

అదేంటి ఫోన కోసం గొడవ ఏంటి అనుకుంటున్నారా..? దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీలుచిక్కినప్పుడల్లా ప్రధాని మోదీ మీదకు అగ్గిమీద గుగ్గలంలా ఫైరవుతారని అందరికి తెలుసు. అయితే మెన్న జరిగిన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో మోదీకి, కేజ్రీవాల్ కు ఎంత మనస్పర్థలున్నాయో అందరికి తెలుసు. అయితే ప్రధాని హోదాలో అందరిని పలకరించాల్సిన మోదీ.. కేజ్రీవాల్ ను ఏదో తప్పదు అన్నట్లు పలకరించారు. సమావేశం తర్వాత ఇప్పటి దాకా మాట్లాడని కేజ్రీవాల్ ఏకంగా ఫోన్ గొడవ గురించి వెల్లడించారు.

ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ జరిగిన మూడురోజుల తర్వాత ఆ సమావేశం గురించి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో జరిగిన ఆ సమావేశం హాల్లోకి తనను ఫోన్ తీసుకెళ్లనివ్వలేదని తాజాగా ఆయన ఆరోపించారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశం దాదాపు పదేళ్ల తర్వాత ఈనెల 16న జరిగింది. కేవలం కొంతమంది ముఖ్యమంత్రులను మాత్రమే ఫోన్లు బయట పెట్టాలని చెప్పారని.. మిగిలిన వాళ్ల గురించి పెద్దగా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.

ఫోన్లను లోపలికి తీసుకెళ్లకుండా అడ్డుకున్న వాళ్లలో తాను, పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఉన్నామని ఆయన తెలిపారు. తన రాష్ట్రంలో ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తనకు ఎలా తెలుస్తుందని ఆమె గట్టిగా నిలదీయడంతో ఆమెను అనుమతించారు గానీ తనను మాత్రం అనుమతించలేదని కేజ్రీవాల్ చెప్పారు. ఐఐటి ఖరగ్‌పూర్‌లో తన బ్యాచ్‌మేట్ అయిన ఓ వ్యక్తి రాసిన ‘అరవింద్ కేజ్రీవాల్ అండ్ ద ఆమ్ ఆద్మీ పార్టీ – యాన్ ఇన్‌సైడ్ లుక్’ అనే పుస్తకం ఆవిష్కరణ సభలో ఆయనీ విషయాలు తెలిపారు. తాను మాట్లాడేటప్పుడు కూడా చాలాసార్లు అడ్డుపడ్డారని, ప్రతిపక్షం మాట వినడానికి కూడా మీకు ఇష్టం లేకపోతే అసలు ఎందుకు పిలిచారని మండిపడ్డానని ఆయన తెలిపారు. తన ప్రభుత్వాన్ని కేంద్రం పనిచేయనివ్వడం లేదని ఆరోపించారు. అంతేగాక కేంద్రం తన ప్రభుత్వంపై సవతి ప్రేమ చూపిస్తోందన్నారు.

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
వాళ్లను వదిలేదిలేదు
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
జియోకే షాకిచ్చే ఆఫర్లు
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
గెలిచి ఓడిన రోహిత్ వేముల
అడవిలో కలకలం
ఆ సిఎంను చూడు బాబు...
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
శోభన్ బాబుతో జయ ఇలా..

Comments

comments