ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం

Asha Workers protest on Condoms

ఆశా అనగానే టక్కున గుర్తోచ్చేది ఆరోగ్య కార్యకర్త. కానీ ఇదే పేరును ప్రస్తుతం ఒక కండోమ్ కి పెట్టుకున్నారు. దీంతో తమ సంస్థ పేరును ఉపయోగిస్తూ కండోమ్స్ పంపిణీ చేయడంపట్ల ఉత్తరాఖండ్ ఆశా (అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అవమానిస్తున్నారని ఆందోళన తలపెట్టారు. అంతకుముందు ఈ కండోమ్స్ ను డీలక్స్ నిరోధ్ గా పిలవగా వాటిని ఆశా నిరోధ్ గా పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేస్తోంది.  దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు.. ఆశా పేరిట నిరోధ్ లు పంపిణీ చేయడం ఆశా వర్కర్లను, అందులో పనిచేసే మహిళలను అవమానించడమే అన్నారు.

ఇప్పటికే ఇవి వేల సంఖ్యలో అన్ని ఆరోగ్యం కేంద్రాలకు వెళ్లాయని చెప్పారు. ఏమాత్రం అలసట తీసుకోకుండా నిరంతరం నిజాయితీగా పనిచేసే ఆశా వర్కర్లకు ఈ చర్య ఇబ్బంది కలిగించే విషయమే అని రాష్ట్ర ఆశా వర్కర్ల అధ్యక్షురాలు శివ దూబే అన్నారు.  ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకారం చేయాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా చేతకాదు గానీ.. తాజాగా ఈ చర్య చేపట్టి మరింత ఆజ్యం పోసిందని ఆందోళన వేగం పెంచారు  దీంతో వెంటనే ఈ నిరోధ్  ల పంపిణీ నిలిపివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
వాళ్లను వదిలేదిలేదు
అంత దైర్యం ఎక్కడిది..?
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
కాశ్మీర్ భారత్‌లో భాగమే
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
మోదీ ప్రాణానికి ముప్పు
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
కాంగ్రెస్ నేత దారుణ హత్య
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం

Comments

comments