బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు

Ashwin new record in test cricket

వింటే భారతం వినాలి..తింటే గారెలే తినాలి.. కొడితే క్రికెట్ లో రికార్డులే కొట్టాలి అన్నట్లుంటి టీమిండియా వ్యవహారం. ఇప్పటికే టీమిండియా ఎన్నో రికార్డులకు వేదికగా నిలిచింది. ఇప్పుడు మరో అరుదైన రికార్డుకు మన క్రికెటర్ శ్రీకారం చుట్టాడు. వందేళ్ల‌లో ఎవ‌రూ సాధించ‌ని రికార్డ్ సాధించాడు అశ్విన్‌. త‌న స్పిన్ మ్యాజిక్‌తో ట‌ప‌ట‌పా వికెట్ల‌ను నేల‌కూల్చేస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన టెస్ట్ సిరీస్‌లో త‌న విశ్వ‌రూపాన్ని చూపించాడు అశ్విన్‌. మూడు టెస్ట్ మ్యాచుల్లో ఏకంగా 27 వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ అందుకున్నాడు. అశ్విన్ ధాటికి కివీస్ విల‌విల్లాడిదంటే అతిశ‌యోక్తి కాదు. అత‌ని మ‌ణిక‌ట్టులో నిజంగానే మాయాజాలం ఉంద‌ని మ‌రోసారి నిరూపించాడు అశ్విన్‌.

అంతేకాదు వందేళ్ల‌లో ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అత‌ని బౌలింగ్ స్ట్రైక్ రేటు ఇప్పుడు 49.4. ఇది ఏ బౌల‌ర్ సాధించ‌లేనిది. 39 టెస్ట్ మ్యాచుల్లో 220 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ బౌల‌ర్ ఈ ఫీట్ సాధించ‌లేదు. తాజాగా ఐసీసీ విడుద‌ల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్‌వ‌న్ బౌల‌ర్‌గా అవ‌త‌రించాడు అశ్విన్‌. అత‌ని బౌలింగ్ బంగారం అన‌డానికి ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం ఏముంటుంది..? అత‌డు నెంబ‌ర్‌వ‌న్ బౌల‌ర్ అని చెప్ప‌డానికి ఈ గ‌ణాంకాలు స‌రిపోవా ? ఇప్పటి వరకు టీమిండియా అంటే బ్యాటింగ్ కు పెట్టింది పేరు కానీ ఇప్పుడు అశ్విన్ పుణ్యాన బాలింగ్ లో కూడా టీమిండియా బాగా బలంగా మారింది అని చెప్పవచ్చు.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
సిరీస్ టీమిండియా సొంతం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐకి సుప్రీం షాక్
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments