కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే

Vajpayee-on-Kashmir

అటల్ బీహారీ వాజ్ పేయ్ కాశ్మీర్ లో, పాకిస్థాన్ లో, ఇండియాలో ఇప్పటికీ.. ఎప్పటికీ హీరో అని చెప్పుకునే వ్యక్తి. భారత ప్రధానిగా ఆయన చేసిన సేవలను దేశం ఎన్నటికీ మరిచిపోలేదు. బిజెపి పార్టీ రథసారధిగా ప్రధాని పీఠాన్ని ఎక్కినా కూడా ఆయన చేసిన సేవలు పార్టీలకు అతీతంగా ఆయనపై ప్రేమను కలిగేలా చేశాయి. ముఖ్యంగా కాశ్మీర్ చరిత్రను చూస్తే మాత్రం అటల్ బీహారీ వాజ్ పేయ్ పేరు ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో కనిపిస్తుంది. కాశ్మీరీలకు సంబందించిన అంశాల్లో ఆయన తీసుకున్న చొరవ, ఆయన వైఖరి ఇప్పటికీ అక్కడ చర్చించుకుంటున్నారు అంటే ఆయన ఎంత పనిమంతుడో అర్థం చేసుకోవచ్చు.

భారత్ కు పాకిస్థాన్ కు మధ్య ఉన్న సరిహద్దును చెరిపేస్తూ.. మనుషుల మధ్య ఎందుకు సరిహద్దులు అంటూ కాశ్మీర్ అంశాన్ని చాలా సున్నితంగా డీల్ చేశారు. ఓ భారత ప్రధాని చరిత్రలో ఎన్నడూ చెయ్యని సాహసం చేశారు. అమెరికాతో సహా ప్రపంచ దేశాలు మొత్తం వాజ్ పేయ్ చూపించిన చొరవ గురించి అభినందించారు. చరిత్రలో మొదటిసారిగా ఓ భారత ప్రధాని పాకిస్థాన్ కు వెళ్లి అక్కడ శాంతి ఒప్పందం మీద సంతాకాలు చెయ్యడం ఇప్పటి వరకు జరిగిన అరుదైన ఘటనల్లో ఒకటి.

ఫిబ్రవరి21, 1999లో నాటి భారత ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయ్ పాకిస్థాన్ టూర్ కు వెళ్లారు. లాహోర్ కు చేరుకున్న వాజ్ పేయ్ కు పాక్ సాదర స్వాగతం పలికింది. ముందు నుండి అనుకున్నట్లు కాశ్మీర్ అనేది ఎంతో కీలకంగా రెండు దేశాలు భావిస్తున్న సమయంలో వాజ్ పేయ్ కాశ్మీరీల సంక్షేమం ఆలోచించి.. ఇక మీదట ఏ దేశం నుండి కాల్పులకు తెగపడకుండా ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

అటల్ బీహారీ వాజ్ పేయ్ చెప్పిన కశ్మీరియత్, జమూరియత్, ఇన్సానియత్(Kashmiriyat, jamhooriyat and insaniyat.)అనే ఫార్ములాను ఎన్నటికీ మరిచిపోలేరు. కాశ్మీర్ సంస్రృతిని కాపాడుతూ, భారత రాజ్యాంగానికి లోబడి మానవత్వం కలిగిన మనుషులుగా మెలుగుదాం అన్న వాజ్ పేయ్ మాటలు ఎంతో మంది హృదయాలకు హత్తుకున్నాయి. ఫిబ్రవరి 21, 1999 నాడు నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత ప్రధాని వాజ్ పేయ్ ల మధ్య లాహోర్ డిక్లరేషన్ పై ఒప్పందం కుదిరింది.

లాహోర్ లోని గవర్నర్ హౌజ్ నుండి వాజ్ పేయ్ మాట్లాడుతుంటే ఇండియా, పాకిస్థాన్ లో లైవ్ వేశారు. ఆయన మాటలు భారతీయులను, కాశ్మీరీలను, పాకిస్థానీలను ప్రభావితం చేశాయి. ఆ ప్రసంగం విన్న తర్వాత పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ‘‘వాజ్ పేయి గారు మీరు ఇక పాకిస్థాన్ ఎన్నికల్లో కూడా పోటీ చెయ్యొచ్చు. ఎందుకంటే మీకు అంత మంది అభిమానులు తయారయ్యారు’’ అని అన్నారు. సాదా-ఈ-సర్హద్ అనే బస్ సర్వీస్ ను దిల్లీ-లాహోర్ ల మధ్య ప్రారంభించారు

1999ని శాంతి సంవత్సరంగా ప్రకటిద్దాం.. రెండు దేశాల మధ్యన ఎలాంటి కాల్పులకు తెగించవద్దు అని రెండు దేశాల నుండి అనుకూలంగా ప్రకటన వచ్చేలా చేశారు. కాశ్మీర్ పై భారత్, పాకిస్థాన్ ల మధ్య ఇంత సామరస్యపూర్వకంగా సమస్య దొరుకుతుందా అని కాశ్మీరీలు విస్తుపోయిన సందర్భం అది. కానీ ఆ వెంటనే పాకిస్థాన్ చేసిన కార్గిల్ దుస్సాహసంతో కాశ్మీరీల ఆశలపై నీళ్లు పడ్డాయి. మొత్తంగా భారత్, పాక్ లను కాశ్మీర్ విషయంలో శాంతి మార్గంలో నడిపింది మాత్రం వాజ్ పేయ్ అని చెప్పాలి.

అసలు భారత్ కాశ్మీర్ ను ఎందుకు వదులుకోవడానికి సిద్దంగా లేదు..? భారత్ కాశ్మీర్ ను కోల్పోతే ఏమేం కోల్పోతుంది..? ఆర్థికంగా, సామాజికంగా, రక్షణపరంగా భారత్ కు కాశ్మీర్ ఎలాంటి లింక్ ఉందో తొమ్మిదో భాగంలో తెలుసుకుందాం.

  • Abhinavachary

Also Read:

కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది(మొదటి భాగం)

పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..(రెండో భాగం)

కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు(మూడో భాగం)

కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ(నాలుగో భాగం)

కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు(ఐదో భాగం)

శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..(ఆరోభాగం)

చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్… అతడికి మాత్రమే సాధ్యమైంది(ఏడో భాగం)

 

Related posts:
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
చిరుకు పవన్ అందుకే దూరం
చంద్రుడి మాయ Diversion Master
బాబు Khan
ఎవరు చాణిక్యులు..?
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే
జయ మరణం వెనక ఆ మాఫియా?

Comments

comments