నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం

Athlet Narsingh yadav away from Sport for four years

రియో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌ వివాదాన్ని ఎదుర్కొంటున్నాడు. డోపింగ్‌ కుట్ర కేసులో జాతీయ డోపింగ్‌ వ్యతిరేక సంఘం (నాడా) ఇప్పటికే నర్సింగ్‌ యాదవ్‌కి క్లీన్‌ చిట్‌ ఇవ్వగా, ప్రపంచ డోపింగ్‌ వ్యతిరేక సంఘం (వాడా) క్రీడల ఆర్బిట్రేషన్‌ కోర్టులో అప్పీల్‌ చేయడంతో వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది. ఎలాంటి వివాదాలూ లేకపోతే నిన్న(ఆగస్ట్‌ 19)న రియోలో నర్సింగ్‌ యాదవ్‌ తన ప్రస్థానం మొదలు పెట్టవలసి ఉంది. అయితే జూన్‌ 25న నాడా నిర్వహించిన పరీక్షల్లో నర్సింగ్‌ యాదవ్‌ విఫలమయ్యాడు. అప్పటినుంచి వివాదం నడుస్తోంది. డోపింగ్‌కి సంబంధించి జరిపిన పరీక్షల్లో నిషేధిత ఉత్ప్రేరకం అయిన మిథెన్‌డైనోవ్‌ అధిక మోతాదులో ఉండటంతో వివాదం తెరపైకి వచ్చింది. దీన్ని నర్సింగ్‌ యాదవ్‌ ఖండించాడు.

తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించడంతో నాడా క్రమశిక్షణ సంఘం విచారించి, నర్సింగ్‌ యాదవ్‌కి అనుకూలంగా నిర్ణయం ప్రకటించింది. ఇంకో వైపున నర్సింగ్‌ ఒలింపిక్స్‌లో ఆడేందుకు ప్రపంచ రెజ్లింగ్‌ సమాఖ్య కూడా ఓకే చెప్పినా, వాడా తీరుతో నర్సింగ్‌ యాదవ్‌ భవితవ్యం, అలాగే ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ పోటీల్లో భారత ప్రాతినిథ్యం రెండూ అయోమయంలో పడ్డాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. రియోలో జరుగుతున్న ఒలంపిక్స్ లో మెన్స్ రెజ్లింగ్ పోటీల్లో ఒక్క పథకం కూడా రాలేదు. దాదాపుగా నర్సింగ్ యాదవ్ కు రియోలో పతకం ఖాయం అని ప్రచారం సాగినా.. చివరి నిమిషంలో ఆశలన్నీ నీరుగారిపోయాయి.

Related posts:
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
కృష్ణా పుష్కర భక్తులకు హెచ్చరిక: కృష్ణా జలాల్లో బ్యాక్టీరియా
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
మహిళలకు వైయస్ ప్రోత్సాహం.. గుర్తుచేసుకున్న నన్నపనేని
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
చంద్రబాబు చిన్న చూపు
అమెరికా ఏమంటోంది?
తిరిగబడితే తారుమారే
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
జయ మరణం ముందే తెలుసా?
వార్దాకు వణికిపోతున్న చెన్నై
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
గుదిబండగా మారిన కోదండరాం

Comments

comments